Watermelon: సమ్మర్‌లో పుచ్చకాయ కచ్చితంగా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే..

పుచ్చకాయ తీసుకుంటే ఆహారానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పుచ్చకాయలో ఉండే నీటి శాతం శరీరానికి మంచి చేస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. మరీ ముఖ్యంగా...

Watermelon: సమ్మర్‌లో పుచ్చకాయ కచ్చితంగా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే..
Watermelon Benefits

Updated on: Mar 08, 2024 | 10:13 PM

పుచ్చకాయ తీసుకుంటే ఆహారానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పుచ్చకాయలో ఉండే నీటి శాతం శరీరానికి మంచి చేస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. మరీ ముఖ్యంగా వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం వల్ల సమ్మర్‌లో వచ్చే సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ పుచ్చకాయ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా సమ్మర్‌లో ఎదురయ్యే సమస్యల్లో డీ హైడ్రేషన్‌ ఒకటి. ఎంత నీరు తీసుకున్నా ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా బయట తిరిగే వారు డీ హైడ్రేషన్‌కు ఎక్కువ గురవుతారు. కాబట్టి సమ్మర్‌లో కచ్చితంగా పుచ్చకాయ తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో 92 శాతం నీరే ఉంటుంది.

* ఇక పుచ్చకాయ బరువు తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి కారణంగా పుచ్చికాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు పెరగడం కూడా కంట్రోల్‌ అవుతుంది.

* ఇక వాటర్‌ మిలన్‌ పోషకాలకు పెట్టింది పేరు. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని సిట్రులైన్ శారీరక చురుకుదనాన్ని పెంచుతుంది.

* అలాగే వాటర్‌ మిలాన్‌లో ఉండే విటమిన్ సి, కెరొటినాయిడ్, లైకోపీన్, కుకుర్బిటాసిన్ సహా పలు యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడేందుకు సాయపడతాయి. దీంతో క్యాన్సర్‌ వంటి సమస్యలు దరిచేరకుండా చూసుకోవవచ్చు.

* కండరాల నొప్పులతో బాధపడేవారికి కూడా పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే సిట్రులైన్ అమైనో యాసిడ్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

* జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా పుచ్చకాయ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థలోని వ్యర్థాలను బయటకు పంపండంలో కీలక పాత్ర పోషిస్తుంది.

* చర్మ సమస్యలకు కూడా వాటర్‌ మిలాన్‌ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ ఏ, విటమిన్ సీ వల్ల చర్మ ఆరోగ్యంగా ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.