
భారతీయ వంటకాల్లో ఎర్ర మిరిపకాయలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అన్ని వంటకాల్లోనూ మిరపకాయలను వాడుతారు. ముఖ్యంగా తాళింపు వేసే సమయంలో ఈ మిర్చిని వాడతారు. వంటకాలలో మిరప్పొడితోపాటు ఎండు మిరపకాయలను కూడా వాడుతారు. కొన్ని ప్రత్యేకమైన వంటకాలలో మిరపకాయలనే ఉపయోగిస్తారు. మిరపకాయలు వంటకాలకు మంచి రుచిని ఇవ్వడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. మిరపకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, పోటాషియం, థయామిన్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉన్నాయి. మినపకాయలను వంటకాల్లో వాడటం వల్ల జీవక్రియను పెంచి బరువును నియంత్రలో ఉంచుతుంది. మిరపకాయలను తీసుకోవడం కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిరపకాయలు మన జీవన ప్రమాణాన్ని పెంచుతాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అంటే మిరపకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది. 20 ఏళ్లపాటు నెలకు ఒక ఘాటైన మిరపకాయ తిన్నవారు తమ మరణ ప్రమాదాన్ని 13 శాతం తగ్గించుకున్నారని ఒక అధ్యయనం తేల్చింది. జీవిత కాలాన్ని పెంచుతాయని నిర్ధారణ అయినప్పటికీ.. అది ఎలా సాధ్యమైందో మాత్రం తేలలేదు. గుండె జబ్బులను కూడా ఈ మిర్చి అరికడుతుంది.
పెద్ద ప్రేగు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారిలో క్యాప్సైసిన్ క్యాన్సర్ కణాలను చంపగలదని పరిశోధనలో తేలింది. ఈ సమ్మేళనం ఈ కణాలు పెరగకుండా, వ్యాప్తి చెందకుండా నిరోధించగలదు.
క్యాప్సై తాత్కాలిక గ్రాహక సంభావ్య వెనిలాయిడ్1 (TRPV1)ను ప్రేరేపిస్తుందని తేల్చింది. ఈ ప్రోటీన్ కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించగలదని, ఆకలిని నియంత్రించగలదని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. దీనిపై మరిన్ని ప్రయోగాలు జరుగనున్నాయి.
క్యాపై్ససిన్‌తోపాటు ఘాటైన మిరపకాలు అనేక పోషక మూలాలు. విటమిన్లు ఎ, సి, ఇ, ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను
నష్టం నుంచి కాపాడతాయి.
ఎండు మిరపకాయల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్ పెరిగి బ్రెయిన్‌కి రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. దీంతో బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది. తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరా కావడంతో ఆల్జీమర్స్ దూరమవుతుంది. ఫలితంగా నేర్చుకోవడం, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి.
ఎండు మిరపకాయల్లోని మ్యాజిక్ క్యాప్సైసిన్ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అంతేగాక, నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నొప్పి నివారిణి.. కంట్రోల్ బీపీ
ఇక, మిరపకాయల్లోని పోటాషియం హైబీపీని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మరోవైపు, ఎండుమిరపకాయలు శరీరంలోని నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా తలనొప్పిని తగ్గించే గుణాలున్నాయి.
ఎండుమిర్చిలోని యాంటీమైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముక్కు దిబ్బడను తగ్గించడంతోపాటు జలుబు, దగ్గును నివారిస్తాయి. సైనస్ వంటి ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. ఎముకలను బలంగా చేస్తుంది.
ఎండు మిరపకాయల్లో విటమిన్ ఉండటం వల్ల కంటి ఆరోగ్యం మెరగవుతుంది. క్రమం తప్పకుండా ఎండు మిర్చి ఆహారంలో తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు తగ్గుతాయి. అంతేగాక, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఎండు మిరపకాయల్లోని విటమిన్ సి.. జుట్టు, చర్మాన్ని రిపేర్ చేసి అవసరమైన ప్రోటీన్, కొల్లాజెన్‌ని నిలుపుకోవడానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఎ జుట్టుని హైడ్రేట్‌గా మార్చుతుంది.