Red Banana: ఎప్పుడు తినాలి ? ఈ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

ఎర్రటి అరటిపండు అనేది శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియ, నరాల పనితీరు, గుండె ఆరోగ్యం, కిడ్నీ, కాలేయం, పేగుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది. ఉదయం 6 గంటలకు లేదా 11 గంటల బ్రేక్ సమయంలో ఈ పండును తినడం వల్ల శక్తి, శాంతి, జీవక్రియలు మెరుగుపడుతాయి. ఇది నరాల బలహీనతను తగ్గించి, కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పంటి సంబంధిత సమస్యలు ఉన్న వారికి కూడా ప్రయోజనకరమైనది. శరీర ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి సరైన సమయాల్లో ఈ పండును తీసుకోవడం మంచిది.

Red Banana: ఎప్పుడు తినాలి ? ఈ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?
Red Banana

Updated on: Jan 18, 2025 | 5:01 PM

ఎర్రటి అరటిపండు ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలతో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, నరాల పనితీరు, గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ, కిడ్నీ, కాలేయం, పేగుల ఆరోగ్యం కోసం అనేక విటమిన్లు, ఖనిజాలు, ఔషధ గుణాలను అందిస్తుంది. ఈ పండు ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక అద్భుతమైన ఔషధం అంటున్నారు వైద్య నిపుణులు.

ఏ సమయంలో తినాలి ?

ఎర్రటి అరటిపండుని ఉదయం 6 గంటల సమయంలో తినాలి. ఈ సమయంలో జీర్ణక్రియ అనేది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను పూర్తిగా అంగీకరించగలిగే స్థితిలో ఉంటుంది. ఉదయం ఈ పండును తినడం వల్ల శరీరానికి శక్తి, శాంతి, జీవక్రియతో కూడిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. మరి ఇతర సమయాల్లో అంటే ఉదయం 11 గంటల సమయంలో లేదా సాయంత్రం 4 గంటల సమయంలో కూడా తినచ్చంటున్నారు నిపుణులు.

నరాల బలహీనతకు ఎర్రటి అరటిపండు

నరాలు బలహీనమైనప్పుడు శక్తి లోపం, నిస్పృహ వంటి సమస్యలు కూడా చోటు చేసుకుంటాయి. అలాంటి వారికి ప్రతిరోజూ రాత్రి ఒక ఎర్రటి అరటిపండు తినడం ద్వారా నరాలు బలపడుతాయి. దీన్ని 48 రోజులపాటు కొనసాగిస్తే, నరాలు శక్తివంతంగా మారుతాయి.

కంటి చూపు సమస్యలు

ఈ పండు కంటి చూపు సమస్యలను కూడా మెరుగుపరుస్తుంది. కంటిచూపు మందగించడం ప్రారంభించిన వారికోసం ఇది ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుంది. ప్రతిరోజూ ఎర్రటి అరటిపండు తీసుకోవడం వల్ల కంటి చూపు క్లియర్ అవుతుంది.

పంటి సంబంధిత సమస్యలు

పంటి నొప్పి, పళ్ళ క్షీణత, పళ్ళను సంరక్షించాల్సిన అవసరం వంటి సమస్యలు ఉన్న వారికి ఈ అరటిపండు మేలు చేస్తుంది. పళ్ళ సమస్యలు ఉన్నవారు, 21 రోజులపాటు ఈ అరటిపండు నిరంతరం తినడం ద్వారా పళ్ళు బలపడుతాయి.

జీర్ణక్రియ

గత రాత్రి తినిన ఆహారం వల్ల ఉదయం మలబద్ధకం సమస్యలు వస్తే, ఉదయం ఒక ఎర్రటి అరటిపండు తినడం ద్వారా పేగులు సక్రమంగా పనిచేస్తాయి. సులభంగా మల విసర్జన జరుగుతుంది. ఇలా ఎర్రటి అరటిపండు తినడం ద్వారా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)