తమలపాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.? ఆ సమస్యకు రామ బాణమే..!

Betel leaves benefits: మన పూర్వకాలం నుంచి భోజనం తర్వాత తమలపాకులను తినడం సంప్రదాయంగా వస్తోంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో మన పూర్వీకులు కూడా తమలపాకులకు శుభ కార్యాలలో ఉపయోగించడంతోపాటు ఆహార పదార్థంగా కూడా తీసుకున్నారు. తమలపాకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అవి నివారించే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.? ఆ సమస్యకు రామ బాణమే..!
Betel Leaves

Updated on: Jan 26, 2026 | 3:44 PM

Health Benefits of Betel Leaves: భారతీయ సంప్రదాయంలో తమలపాకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శుభ కార్యాలతోపాటు అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎక్కువగా పాన్‌లలో తమలపాకులను వినియోగిస్తారు. మన పూర్వకాలం నుంచి భోజనం తర్వాత తమలపాకులను తినడం సంప్రదాయంగా వస్తోంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో మన పూర్వీకులు కూడా తమలపాకులకు శుభ కార్యాలలో ఉపయోగించడంతోపాటు ఆహార పదార్థంగా కూడా తీసుకున్నారు. తమలపాకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అవి నివారించే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకుల్లో పోషకాలు

తమలపాకులు రుచికరమైనవే కాదు.. అనేక పోషకాలను కూడా కలిగి ఉన్నాయి. తమలపాకుల్లో కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, ఫైబర్ కలిగి ఉన్నాయి. తమలపాకులు పొట్టలో గ్యాస్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

తమలపాకులతో గ్యాస్ నుంచి ఉపశమనం

గ్యాస్ లేదా యాసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడంలో తమలపాకులది ముఖ్యమైన పాత్ర. రెండు టీ స్పూన్ల తేనె, అర టీస్పూన్ నిమ్మరసం, ఒక కప్పు నీరు, రెండు నుంచి మూడు తులసి ఆకులు అవసరం. తమలపాకులను కడిగి రెండు ముక్కలు చేసి.. గోరువెచ్చని నీటిలో పది నిమిషాలపాటు నాన బెట్టండి. తులసి ఆకులను కూడా నానబెట్టి.. ఈ రెండు ఆకుల రసాన్ని తీసి వడకట్టండి. ఈ రసంలో తేనె, నిమ్మరసం వేసి కలపండి. ఈ పానీయాన్ని ఉదయం లేదా భోజనం తర్వాత తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది.

తమలపాకుల ప్రయోజనాలు

తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతాయి. ఈ ఆకులలో ఉండే సహజ పదార్థాలు ఉబ్బరం, అజీర్ణం, తేలికపాటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాసిడిటీతో బాధపడేవారు తరచూ తమలపాకులను తినవచ్చు. అంతేగాక, ఈ ఆకులు దగ్గు, జలుబు, వాపు చిగుళ్లను తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.