AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: జుట్టు రాలటానికి ఇవి కూడా కారణమట.. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..

Hair Care Tips: అలసట, ఊపిరి ఆడకపోవడాన్ని సాధారణంగా కోవిడ్ లక్షణాలుగా పరిగణిస్తారు. ఈ సమస్యలు చాలా కాలం పాటు వెంటాడుతూనే ఉంటాయి.

Hair Care Tips: జుట్టు రాలటానికి ఇవి కూడా కారణమట.. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..
Hair Care Tips
Shiva Prajapati
|

Updated on: Jul 27, 2022 | 8:42 AM

Share

Hair Care Tips: అలసట, ఊపిరి ఆడకపోవడాన్ని సాధారణంగా కోవిడ్ లక్షణాలుగా పరిగణిస్తారు. ఈ సమస్యలు చాలా కాలం పాటు వెంటాడుతూనే ఉంటాయి. ఇవి ప్రజల రోజువారీ కార్యకలాపాలు, జీవన నాణ్యత, పని సామర్థ్యాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తాయి. కానీ దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు దీని కంటే చాలా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం.. 62 లక్షణాలు కోవిడ్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో జుట్టు రాలిపోయే సమస్య అధికంగా పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది.

కోవిడ్ సోకిన వారిలో 62 రకాల లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. అయితే, వాటిలో 20 లక్షణాలు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ క్లినికల్ కేసుల నిర్వచనంలో చేర్చింది. 12 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కోవిడ్ సోకిన వ్యక్తులలో శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్ని లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. జుట్టు రాలడం వంటి సమస్యలు తక్కువగా ఉన్నప్పటికీ.. దీని ప్రభావం అధికంగా ఉందంటున్నారు వైద్యులు. డాక్టర్ అక్షయ్ బాత్రా టీవీ9తో మాట్లాడుతూ.. జుట్టు రాలడానికి అనేక సమస్యలు ఉన్నాయన్నారు.

జుట్టు రాలడానికి ఈ 40 కారణాలు:

డాక్టర్ బాత్రా ప్రకారం.. జుట్టు రాలడానికి దాదాపు 40 కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, రక్తహీనత, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి వ్యాధుల సంకేతంగా ఉండవచ్చు. మీ జుట్టు స్థితి మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ మానసిక, భావోద్వేగ స్థితిని కూడా తెలుపుతుంది. బట్టతల పురుషుల ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. చాలా సందర్భాలలో, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

జుట్టు సమస్యలకు కారణాలివే..

1. రక్తహీనత మరియు థైరాయిడ్ సమస్యలు

2. స్ట్రెయిటెనింగ్, పెర్మింగ్ మరియు కలరింగ్ వంటి జుట్టుకు రసాయన చికిత్స.

3. రేడియేషన్ థెరపీ.

4. క్రాష్ డైటింగ్.

5. శుభ్రత లేకపోవడం.

6. సుదీర్ఘమైన కోవిడ్ లక్షణాలు.

జుట్టు సంరక్షణ చర్యలు..

డాక్టర్ బాత్రా సూచనల ప్రకారం.. ‘తల చర్మం జుట్టు కుదుళ్లకు, జుట్టుకు మధ్య లింక్. చుండ్రు, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లపై శ్రద్ధ వహించాలి. పొడి స్కాల్ప్ చుండ్రుకు దారితీస్తుంది. అధికంగా జిడ్డుగల స్కాల్ప్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అనుకూలమైన ప్రదేశంగా మారుతుంది. ఈ సమస్యల కారణంగా జుట్టు రాలుతుంది. చాలా మంది దీనిని జుట్టు రాలడం అని అనుకుంటారు. అయితే, ఈ రకమైన జుట్టు రాలే సమస్యను వైద్య పరిభాషలో టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. ఇది తాత్కాలిక దశ. ఇది ఆరు నుంచి 9 నెలల వరకు ఉంటుంది. జుట్టు రాలే సమస్య కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

జుట్టు రాలడానికి ఇతర కారణాలు..

జుట్టు రాలడానికి స్కాల్ప్ ఎగ్జిమా, స్కాల్ప్ సోరియాసిస్ ప్రధాన కారణంగా చెపుబుతున్నారు నిపుణులు. స్కాల్ప్ సోరియాసిస్ నెత్తిమీద మందంగా, పొలుసులుగా, పెరిగిన పాచెస్‌గా ప్రారంభమవుతుంది. ఆ తరువాత చెవులు, మెడ, నుదిటి వరకు వ్యాపించవచ్చు. ఇది ఒక ఆటో-ఇమ్యూన్ వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసినప్పుడు ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం పొరలుగా ఉంటుంది.

స్కాల్ప్ ఎగ్జిమా వల్ల సమస్య పెరుగుతుంది..

స్కాల్ప్ ఎగ్జిమా వల్ల చర్మంపై దురద, పొడి, ఎర్రబడిన చర్మం వస్తుంది. దీనికి సాధారణ కారణాలు మితిమీరిన షాంపూ వాడకం, రసాయనాలను ఎక్కువగా ఉపయోగించడం. ఇది తలపై చికాకు, వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధులకు చికిత్స చేయకపోతే.. శరీరంలోని వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతాయి.

ఇలాంటి సమస్యలకు నోటి ద్వారా తీసుకునే మందులు, షాంపూలు, లోషన్లు చాలానే ఉన్నాయి. అయితే, ఔషధాల్లో ఉండే పదార్థాలు ఎక్కువగా వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, చికాకు, అలెర్జీ, రక్తపోటు, నపుంసకత్వం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వాడటం మంచిదని సూచిస్తున్నారు. వాపు, దురద, ఫ్లాకీ స్కాల్ప్స్‌తో బాధపడుతున్న చాలా మందికి కాలీ సల్ఫ్యూరికం సిఫార్సు చేయడం జరుగుతుంది.

సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

1. జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి.

2. మృదువైన పళ్లు కలిగిని హెయిర్ బ్రష్ ఉపయోగించాలి.

3. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి.