Diabetes: కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించడం వల్ల వివిధ వ్యాధులున్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడించేది మధుమేహం. ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా వంశపారంపర్యం వల్ల కూడా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే జీవనశైలి, ఆహార నియమాలలో మార్పులు, ఒత్తిడి, ఇతర కారణాల వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే జీవన శైలిలో మార్పులు, ఆహాపు అలవాట్లలో మార్పుల వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవడం తప్ప.. పూర్తిగా నయం చేసుకోలేము. రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుకునేందుకు రకరకాల మార్గాలున్నాయి. అందులో ఇది ఎంతో ఉత్తమమైనది. ఈ ఆకు నమలడం వల్ల రోజంతా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దాని పేరే గుర్మార్ మొక్క ఆకులు (Gurmar leaves). దీని ఆకులు, కాండం, వేర్లకు ఆయుర్వేదంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
ఇది అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. గార్మార్‌ను ఔషధ తయారీకి కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయిని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు భారతదేశంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ సహా పలు రాష్ట్రాల్లో లభిస్తుంది. ఇది కాకుండా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, చైనా వంటి దేశాలలో కూడా ఇది కనిపిస్తుంది. దీని ఆకులతో డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు.
ఈ గుర్మార్ ఆకులు ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఎంతగానో పని చేస్తుంది. ఇందులో యాంటీ అథెరోస్క్లెరోటిక్ లక్షణాలు ఉన్నాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారితో పాటు ఇతర వ్యాధులకు కూడా పనిచేస్తాయి. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. గుర్మార్ ఆకులను తిన్న తర్వాత గంటలో తీపి రుచి మాయమవుతుంది. మీరు ఖాళీ కడుపుతో గుడ్మార్ ఆకులను నమలవచ్చు. ఆకులు తిన్న తరువాత ఒక గ్లాసు నీరు తీసుకోండి. ఇది మీ చక్కెర స్థాయిని తగ్గించడమే కాక రోజంతా చక్కెర స్థాయిని పెంచడానికి అనుమతించదు. మీరు రోజూ గుర్మార్ ఆకులను నమలవచ్చు. ఇందులోయాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి కొలొస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. గుర్మార్‌లో జిమ్నాస్టిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే ప్రోటీన్ యాంజియోటెన్సిన్ చర్యను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
చర్మానికి ఎంతో మేలు..
ఈ ఆకులు చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. గుర్మార్ ఆకులు తీసుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దీని గుళికలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులు తినడం వల్ల చర్మంపై తెల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కామెర్ల చికిత్సలో కూడా ఈ ఆకులను ఉపయోగిస్తారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు కామెర్ల చికిత్స కోసం గుర్మార్ ఆకులను తింటుంటారు. అజీర్ణం, కంటి చూపు సమస్య, ఉబ్బసం, కార్డియోపతి, హైపర్ కొలెస్టెరోలేమియా మొదలైన వాటికి మంచి ఔషధంగా ఉపయోగపడతాయట. మధుమేహం ఉన్న వారు ఈ ఆకులను పొడిగా చేసి నీటిలో కలుపుకొని తాగవచ్చు. లంచ్, డిన్నర్ చేసిన గంట తర్వాత తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: