Gotu Kola: జ్ఞాపకశక్తికి ప్రకృతి వర ప్రసాదం ‘గోతుకోలా’.. అనేక వ్యాధులను నివారించే దివ్య ఔషధం

|

Oct 04, 2021 | 9:55 PM

Gotu Kola Perennial Herb: ఇంట్లో అందం కోసం మనం పెంచుకునే మొక్కల్లో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. అటువంటి మొక్కలో ఒకటి గోతు కోలా..

Gotu Kola: జ్ఞాపకశక్తికి ప్రకృతి వర ప్రసాదం గోతుకోలా.. అనేక వ్యాధులను నివారించే దివ్య ఔషధం
Gotu Kola Herb Plant
Follow us on

Gotu Kola Perennial Herb: ఇంట్లో అందం కోసం మనం పెంచుకునే మొక్కల్లో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. అటువంటి మొక్కలో ఒకటి గోతు కోలా. ఇది చాలా సులభంగా పెరుగుతుంది. ఆసియా దేశాలైన భారత, ఇండోనేషియా, మలేషియన్, వియత్నా, థాయ్, చైనా వంటకాల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకు మొక్క. తీపి , చేదు రుచితో పాటు సువాసన కలిగి ఉంటుంది. ఈ ఆకుని శ్రీలంక లో ఫేమస్టు వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇక సాంప్రదాయ చైనీస్  వైద్యం పాటు మనదేశంలో ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. గోతు కోలా ఆహారంగా, టీగా తీసుకుంటారు. ఇక అనేక ఔషధగుణాలు కూడా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది.

ఆరోగ్య ప్రయోజనాలు:

*గోతు కోలా మొక్క జ్ఞాపకశక్తిని పెంచే దివ్య ఔషధం. నాడీ వ్యవస్థను పునరుజ్జీవించి ఏకాగ్రతను పెంచుతుంది.

*చర్మం గాయాలపై ఆకు రసం అప్లై చేస్తే వెంటనే గాయాలు నయం అవుతాయి. మచ్చలను కూడా లేకుండా చేస్తుంది.

*అకాల వృద్ధాప్య ఛాయలను రాకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

*గోతు కోలాను యాంటీమైక్రోబయల్, యాంటీడియాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిడిప్రెసెంట్ ఉన్నాయి. ఇవి  మెమరీని పెంచుతాయి. క్యాప్సూల్, పౌడర్ గా లభ్యమవుతుంది.

*గోతు కోలా అంటువ్యాధుల చికిత్స కు ఉపయోగిస్తారు. అంతేకాదు అల్జీమర్స్ వ్యాధి, రక్తం గడ్డకట్టడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

*మానసిక ఆందోళన, ఉబ్బసం,  మధుమేహం, విరేచనాలు, అలసట, అజీర్ణం,  వంటి అనేక వ్యాధులను నివారిస్తుందని సాంప్రదాయ వైద్యులు చెప్పారు.

*2017 లో గోతు కోలా జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుందని శాస్త్రీయంగా నిరూపించారు.

*దీర్ఘకాలిక సిరల లోపం (సివిఐ) ఉన్నవారిలో గోతు కోలా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని ఆధారాలతో సహా 2013 లో మలేషియా నిఫుణులు నిరూపించారు. గోతు కోలాతో చికిత్స పొందిన వృద్ధుల్లో రక్త ప్రసరణ మెరుగుపడింది.

Also Read:  శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు హెచ్చరిక.. ఇవి లేకపోతే అనుమతించేంది లేదంటున్న అధికారులు