‘వెల్లుల్లి ట్యాబ్లెట్స్’… వింటుంటేనే కొత్తగా ఉంది కదూ. మీరు విన్నది నిజమే. వెల్లుల్లితో మాత్రలు తయారు చేస్తున్నారు. అదేక్కడో కాదు మన ఇండియాలోనే. వీటిని కీళ్ల నొప్పులు, బ్లడ్ కొలెస్ట్రాల్ వంటి జబ్బులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రాజస్థాన్‌లోని కోటాలో కృషి విజ్ఞాన కేంద్రం మహిళా సిబ్బంది వెల్లుల్లితో ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారు. దాదాపు 500, 1000 మిల్లీ గ్రాములుగా ఆన్లైన్లో లభింస్తుంటాయి. అయితే ప్రస్తుతం వీటికి దేశవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగింది. ఔషధ గుణాలున్న వెల్లుల్లితో కీళ్ళ నొప్పులు, బ్లడ్ కొలెస్ట్రాల్ వంటి జబ్బులను నివారించవచ్చని.. అలాగే చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయని కృషి విజ్ఞాన్ కేంద్రం డాక్టర్ మమతా తివారి తెలిపారు. ఎండబెట్టిన వెల్లుల్లిని వలిచి ఆ తర్వాత వాటిని పొడి చేస్తామని తెలిపారు. ఒక కిలో వెల్లుల్లితో దాదాపు 100 గ్రాముల పౌడర్ తయారవుతోందని తెలిపారు. వెల్లుల్లి ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి సుమారు 10 రోజుల సమయం పడుతుందని అందులో పనిచేసే సిబ్బంది తెలిపారు. వెల్లుల్లి వాసనకు విరుగుడుగా అందులో జంతు పదార్థాల నుంచి సేకరించే ప్రొటీన్ (యానిమల్ జెలాటిన్), బియ్యం పొట్టు ఉపయోగిస్తున్నామని తెలిపారు.
Also Read:
క్యాన్సర్‌ను అదుపుచేయడానికి ఉల్లిపాయాలు సహయపడతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..