Diabetes: అలాంటి వారు ఈ పండ్లకు దూరంగా ఉండటం బెటర్.. లేకపోతే ప్రమాదం ముంచుకొస్తున్నట్లే..

|

Aug 28, 2022 | 10:38 AM

వాస్తవానికి పండ్లు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. అయితే మధుమేహం వంటి వ్యాధుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Diabetes: అలాంటి వారు ఈ పండ్లకు దూరంగా ఉండటం బెటర్.. లేకపోతే ప్రమాదం ముంచుకొస్తున్నట్లే..
Fruits
Follow us on

Diabetes Care: పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ పండ్లను తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు. వాస్తవానికి పండ్లు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. అయితే మధుమేహం వంటి వ్యాధుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చక్కెర స్థాయిని పెంచే కొన్ని పండ్లకు మధుమేహ బాధితులు దూరంగా ఉండాలంటున్నారు. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి పండ్లు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక చక్కెర పండ్లు..

మధుమేహం పెరగడానికి ప్రధాన కారణం శరీరంలో చక్కెర స్థాయి పెరగడమే. ఆహారం ద్వారా శరీరంలో చక్కెర అధికంగా ఉంటే.. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించలేము. అటువంటి పరిస్థితిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న పండ్లను ఎక్కువగా తినకూడదు. ఏదైనా పండు, లేదా కూరగాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి 100 మరియు 70 మధ్య ఉంటే అటువంటి వాటిలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉన్నా లేదా దాని లక్షణాలు కనిపించినా అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినకూడదు.

ఇవి కూడా చదవండి

ఎలాంటి పండ్లు తినకూడదు?

పుచ్చకాయ, డ్రైప్లమ్స్, పైనాపిల్స్, పండిన అరటిపండ్లు, నారింజ, ఎండుద్రాక్ష, ద్రాక్ష, ఖర్జూరం వంటి తీపి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ పండ్లను తినడం మానేయాలి.

ఈ పండ్లు కాకుండా, శీతల పానీయాలు, వైట్ బ్రెడ్, వైట్ రైస్, బంగాళదుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి ఎక్కువగా ఉంటుంది.

గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు, పండ్లు, కూరగాయలు, అధిక కార్బోహైడ్రేట్ స్థాయిలు ఉన్న ఆహారం కూడా డయాబెటిస్ ఉన్నవారికి హాని చేస్తుంది. మామిడి, ద్రాక్ష, యాపిల్, అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

ఎలాంటి పండ్లు తినవచ్చు?

రేగు, కివి, జామూన్‌లో ఫ్రూట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పండ్లను మధుమేహ బాధితులు తినవచ్చు.

ఎంత పరిమాణంలో పండ్లు తినవచ్చు?

సాధారణంగా మనం పండ్లతో చక్కెర స్థాయి పెరుగుతుందని, వాటిని పూర్తిగా నివారిస్తుంటాం.. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదు. అధిక చక్కెర ఉన్న పండ్లు కూడా సరైన మొత్తంలో తింటే అవి మన ఆరోగ్యానికి హాని చేయవు. ప్రయోజనం కూడా చేకూరుతుంది. అయితే, ఇది మీ చక్కెర స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌లో ఆహారం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..