AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Frequent Urination: చిన్న సమస్యే కదా అని వదిలేయకండి.. తరచుగా యూరిన్ వస్తుంటే అది ‘సైలెంట్ కిల్లర్’ కావచ్చు!

నేటి యాంత్రిక జీవనంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం మనకు అలవాటుగా మారిపోయింది. అయితే, మన శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలను పట్టించుకోకపోతే అవి భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధులుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లడం, గొంతు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు వెంటనే అప్రమత్తం కావాల్సిందే.

Frequent Urination: చిన్న సమస్యే కదా అని వదిలేయకండి.. తరచుగా యూరిన్ వస్తుంటే అది 'సైలెంట్ కిల్లర్' కావచ్చు!
Frequent Urination Symptoms Telugu
Bhavani
|

Updated on: Apr 10, 2026 | 8:30 PM

Share

ఏదైనా పెద్ద వ్యాధి మనపై దాడి చేసే ముందు శరీరం కొన్ని స్పష్టమైన లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా మధుమేహం (డయాబెటిస్) విషయంలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. వీటిని లైట్ తీసుకోకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ లక్షణాలు ఎవరిలో ఎక్కువ డేంజరో ఇప్పుడు తెలుసుకుందాం..

1. తరచుగా మూత్రవిసర్జన (Polyuria): పగటిపూట మాత్రమే కాకుండా, రాత్రి సమయంలో పదే పదే నిద్రలేచి మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటే అది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయనడానికి ప్రధాన సంకేతం. శరీరంలోని అదనపు చక్కెరను బయటకు పంపడానికి కిడ్నీలు అతిగా శ్రమించడం వల్ల ఇలా జరుగుతుంది.

2. ఆగని దాహం (Polydipsia): నీళ్లు తాగిన కొద్దిసేపటికే గొంతు పొడిగా అనిపించడం, నిరంతరం దాహంగా ఉండటం మధుమేహం మరో ముఖ్య లక్షణం. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

3. అలసట మరియు నీరసం: తగినంత ఆహారం తీసుకున్నా, విశ్రాంతి తీసుకున్నా శరీరం రోజంతా అలసిపోయినట్లుగా ఉంటే అది ఇన్సులిన్ లోపాన్ని సూచించవచ్చు.

నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఈ లక్షణాలను కేవలం సాధారణ మార్పులుగా భావిస్తే, సమస్య మరింత తీవ్రమై శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది:

కిడ్నీ సమస్యలు: దీర్ఘకాలికంగా చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది.

దృష్టి లోపం: కంటి చూపు మందగించడం లేదా మసకబారడం సంభవించవచ్చు.

గుండె ఆరోగ్యం: రక్తపోటు పెరిగి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఈ వ్యాసంలోని సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఎటువంటి ఆరోగ్య నిర్ణయాలకైనా లేదా చికిత్సకైనా మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

Follow Us