
చలికాలం వచ్చిందంటే చాలామంది వార్డ్‌రోబ్ మొత్తం మందమైన స్వెటర్లు, థిక్ జాకెట్లు, థర్మల్స్తో నింపేస్తారు. స్టైల్ కంటే కూడా చలి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకే మొగ్గు చూపుతారు. అయితే చలికాలంలోనూ చిన్నచిన్న మార్పులతో స్టైలిష్ ఐకాన్‌గా మెరిసిపోవచ్చు. ఆ స్టైల్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..
ఈ టెక్నిక్‌తో శరీరాన్ని వెచ్చగా ఉంచుతూనే స్లిమ్ లుక్‌లో నాజూగ్గా మెరిసిపోవచ్చు! చలికాలంలో మందమైన దుస్తులు వేసుకుంటే బాడీ షేప్ దాదాపుగా మారిపోతుంది. బదులుగా, లైట్‌వెయిట్ లేయర్స్ ఎంచుకోవాలి. ముందు ఒక టర్టిల్‌నెక్ టీ-షర్ట్ లేదా ఫిటెడ్ టాప్ వేసుకుని, ఆ తర్వాత బ్లేజర్ లేదా లాంగ్ కోట్ యాడ్ చేయాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతూనే సూపర్ స్లిమ్ లుక్ ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర బ్లేజర్, కోట్ లేకపోతే జీన్స్‌తో మ్యాచ్ అయ్యే డెనిమ్ జాకెట్‌తో ఈ స్టైల్‌ని మ్యాచ్ చేయొచ్చు!
వింటర్ కలర్స్ అంటే డార్క్ షేడ్స్ మాత్రమే కాదు, లైట్ బ్రౌన్, వీట్, డీప్ బ్రౌన్, బ్లాక్ ఎంచుకోవాలి. ఇవి ఆఫీస్ లుక్‌కి పర్ఫెక్ట్, ఎందుకంటే ఏ కలర్‌తోనైనా మ్యాచ్ అవుతాయి. బ్లేజర్ కొనేటప్పుడు బ్రౌన్ షేడ్ తీసుకోండి. అది మీ ఔట్‌ఫిట్‌ని హైలైట్ చేస్తుంది. బ్లాక్ ప్యాంట్‌తో వైట్ బ్లౌజ్, దానిపై బ్రౌన్ బ్లేజర్ వేసుకుంటే ఇన్‌స్టంట్ ప్రొఫెషనల్ లుక్‌తో హైలెట్ చేస్తుంది! చలికాలంలో ఈ కలర్స్ స్కిన్ టోన్‌ని డామినేట్ చేయకుండా చక్కగా నప్పుతాయి. లుక్ కూడా ఎలిగెంట్‌గా ఉంటుంది.
స్కార్ఫ్ అంటే కేవలం చలి నుంచి ప్రొటెక్షన్ మాత్రమే కాదు.. అది మీ ఔట్‌ఫిట్‌కి ఒక ఫ్యాషన్ బూస్టర్! చిన్నచిన్న టెక్నిక్స్‌తో స్కార్ఫ్‌ని స్టైల్ స్టేట్‌మెంట్‌గా మార్చేయవచ్చు. సిల్క్ లేదా కాటన్ ప్రింటెడ్ స్కార్ఫ్స్ ఎంచుకుని వాటిని క్రియేటివ్‌గా టై చేయాలి. నెక్ మీద లూస్‌గా లేదా షోల్డర్స్ మీద డ్రాప్ చేయాలి. షాల్స్‌ని కూడా ఫ్యాషనబుల్ స్టైల్స్‌లో వాడాలి. ఇది మీ లుక్‌ని ఇన్‌స్టంట్‌గా మార్చేస్తుంది. అంతేకాదు చలిని కూడా బ్లాక్ చేస్తుంది. మీ ఔట్‌ఫిట్ కలర్‌కి కాంట్రాస్ట్ అయ్యే ప్రింట్ స్కార్ఫ్ తీసుకుంటే స్టైల్ క్వీన్‌లా మెరిసిపోతారు!
వింటర్‌లో సాండల్స్ వాడటం కంటే లెదర్ బూట్స్, లోఫర్స్ లేదా క్లోజ్డ్ హీల్స్ ఎంచుకోండి. బ్లాక్ లేదా లైట్ బ్రౌన్ కలర్స్ అన్ని ఔట్‌ఫిట్‌లకి సూట్ అవుతాయి. ఆఫీస్ లుక్ కోసం ఈ షూస్‌లు పర్ఫెక్ట్. మెయింటెనెన్స్ మరచిపోవద్దు, వాటిని క్లీన్‌గా, పాలిష్ చేయాలి. అప్పుడే మీ ఓవరాల్ లుక్ కంప్లీట్ అవుతుంది. లెదర్ బూట్స్‌లో వాక్ చేస్తుంటే, మీ కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. హై హీల్ బూట్స్‌తో స్కర్ట్ మ్యాచ్ చేసి వేసుకుంటే కాళ్లు పొడవుగా కనిపిస్తాయి.
చలికాలంలో హెవీ మేకప్ వేసుకుంటే స్కిన్ డ్రై అయిపోతుంది. ఆఫీస్‌లో మరి మోస్తరుగా కనిపించేలా లైట్ ఫౌండేషన్, న్యూడ్ లిప్‌స్టిక్, కొంచెం మాస్కారా తో సరిపెట్టేయాలి. స్మాల్ స్టడ్స్, వాచ్ లేదా థిన్ చైన్ మాత్రమే వేసుకోవాలి. ఇది మీ లుక్‌ని ప్రొఫెషనల్‌గా, అట్రాక్టివ్‌గా ఉంచుతుంది. లైట్ జువెల్లరీతో స్టైలిష్ లుక్ వస్తుంది. రాత్రి పార్టీలకు మాత్రమే హెవీ జువెల్లరీ వేసుకోవాలి!