Alert: మరుపు మంచిది కాదు..! ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే అల్జీమర్స్ ముప్పు

‘ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టానో మర్చిపోయాను… ఇది నార్మల్ కదా?’ అని అందరం ఒక్కసారైనా అనుకున్నాం. కానీ కొన్ని మరచిపోతున్న విషయాలు సాధారణ వయసు ప్రభావం కాకుండా, అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. భారత్‌లోనే ..

Alert: మరుపు మంచిది కాదు..! ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే అల్జీమర్స్ ముప్పు
Alzeimers1

Updated on: Nov 27, 2025 | 11:01 PM

‘ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టానో మర్చిపోయాను… ఇది నార్మల్ కదా?’ అని అందరం ఒక్కసారైనా అనుకున్నాం. కానీ కొన్ని మరచిపోతున్న విషయాలు సాధారణ వయసు ప్రభావం కాకుండా, అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. భారత్‌లోనే 40 లక్షలు! ఈ సమస్యను మొదటి దశలోనే గుర్తిస్తే 30-50% నియంత్రించవచ్చు. అల్జీమర్స్​ వచ్చే ముందు కనిపించే లక్షణాలేవో తెలుసుకుందాం..

  • కొత్త సమాచారం గుర్తుంచుకోలేకపోవడం.. నిన్న ఏమి తిన్నారో, ఎవరితో మాట్లాడారో గుర్తులేదంటే జాగ్రత్త.
  • రోజువారీ పనుల్లో ఇబ్బంది.. గ్యాస్ ఆఫ్ చేయడం, డబ్బు లెక్కలు, షాపింగ్ లిస్ట్ ఈ సాధారణ పనులు కూడా గందరగోళంగా మారితే అనుమానించాల్సిందే.
  • తేదీ, సమయం, సీజన్ మర్చిపోవడం.. ‘ఇవాళ ఏం రోజు?’ అని రోజూ అడగడం మొదలైతే జాగ్రత్తగా ఉండాల్సిందే.
  • వస్తువులు తప్పుడు చోట పెట్టడం.. ఒకచోట పెట్టే వస్తువును మరో చోట పెట్టడం, తాళం చెవులు ఫ్రిజ్‌లో, రిమోట్‌ను షూరాక్‌లో పెట్టడం వంటివి.

    Alzeimers

  • మాటలు, పేర్లు మర్చిపోవడం.. ‘అది… అదే… ఆ పచ్చటి పండు’ అని బొత్తిగా పేరు గుర్తురాకపోవడం.
  •  నిర్ణయాలు తీసుకోలేకపోవడం.. ఏం ధరించాలి, ఏం కొనాలి అనే చిన్న చిన్న విషయాల్లోనూ గందరగోళం.
  •  మూడ్, వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు.. ఎప్పుడూ నవ్వే వ్యక్తి ఒక్కసారిగా ఏడుస్తూ, అనుమానంతో ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.
  • సోషల్ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉండటం.. స్నేహితులతో కలవడం, గేమ్స్ ఆడటం మానేయడం.
  •  దారి తప్పడం.. ఇంటికి వచ్చే రోడ్డు కూడా గుర్తులేకపోవడం.
  •  రాత, భాషలో మార్పులు.. వాక్యాలు పూర్తి చేయలేకపోవడం, తప్పులు రాయడం.

ఇవన్నీ ఒక్కసారిగా రాకపోవచ్చు. కానీ 3-4 లక్షణాలు కనిపిస్తే వెంటనే న్యూరాలజిస్ట్‌ను కలవడం మంచిది. ముందస్తుగా ఈ సమస్యను కనుక్కుంటే మందులు, జీవనశైలిలో రోజూ 30 నిమిషాల వాకింగ్, మెడిటేషన్, ఆరోగ్యకరమైన ఆహారం వంటి చిన్నచిన్న మార్పులు సమస్యను నియంత్రణలో ఉంచుతాయి. మర్చిపోవడం వయసుతో వచ్చే సహజ ప్రక్రియ కావచ్చు, కానీ కొన్నిసార్లు అది మనిషిని మర్చిపోయేలా చేసే వ్యాధి కూడా కావచ్చు.. జాగ్రత్తగా ఉండండి!

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.