Liver Disease: శరీరంలోని అవయవాలలో లివర్ చాలా ముఖ్యమైంది. ఇది దెబ్బతింటే మనిషి ప్రాణాలకే ప్రమాదం.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడానికి, టాక్సిన్స్ తొలగించడానికి, శక్తిని నిల్వ చేయడానికి పనిచేస్తుంది. కాలేయంలో కొంత మొత్తంలో కొవ్వు ఉంటుంది. అయితే ఈ పరిమాణం దాటితే కాలేయానికి ముప్పుగా మారుతుంది. నివేదిక ప్రకారం కాలేయంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు అది ఫ్యాటీ లివర్ వ్యాధికి గురవుతుంది. ఈ వ్యాధిలో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని సులభంగా నయం చేయవచ్చు. కానీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ను నయం చేయడానికి చికిత్స కచ్చితంగా అవసరం.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
వైద్యుల ప్రకారం శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభిస్తే వ్యాధిని సులభంగా నివారించవచ్చు. పొత్తికడుపు చుట్టూ కొవ్వు చేరడం, ఊబకాయం, అధిక శరీర కొవ్వు స్థాయిలు, అధిక రక్తపోటు, టైప్ -2 మధుమేహం, మొదలైనవి కనిపిస్తే ఫ్యాటి లివర్ వ్యాధిగా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో వైదుడిని సంప్రదిస్తే మంచిది.
ఎలా నిరోధించాలి..?
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేయాలి. అన్నింటిలో మొదటిది, మద్యపానానికి దూరంగా ఉండాలి. తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయం రెండూ దెబ్బతింటాయి. కొవ్వు కాలేయ సమస్యను నివారించడానికి మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీర బరువును తగ్గించుకోవడంపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజూ కనీసం 2 గంటలు కష్టపడి పని చేయాలి. ఆహారంలో తృణధాన్యాల పరిమాణం పెంచాలి.