తులసి చాలా భారతీయ గృహాలలో ఒక ముఖ్యమైన భాగం. దీనిని ఇంటి ప్రాంగణంలో నాటడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ మొక్కలోని ఆయుర్వేద ప్రాముఖ్యత చాలా గొప్పది. తులసి ఔషధ గుణాల నిధిగా పరిగణించబడుతుంది. దీని ఆకులను జలుబు,దగ్గును నయం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే తులసి గింజలు మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని మీకు తెలుసా. వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాగా తులసి గింజలు ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. తులసి గింజలను తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం చాలా వరకు తగ్గతుందని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ గింజల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ విత్తనాలు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
తులసి గింజల ప్రయోజనాలు
1. రోగనిరోధక శక్తి…
మనో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఇది అనేక అంటువ్యాధుల నుంచే కాదు దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా రక్షిస్తుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో తులసి అద్భుతమైన ఉపషమనంను కలిగించింది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తులసి గింజలను కషాయం చేసి తాగవచ్చు.
2. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది
మీకు మలబద్ధకం, అసిడిటీ గ్యాస్ సమస్య ఉంటే తులసి గింజలను నీటిలో వేసి నానబెట్టాలి. అవి ఉబ్బే వరకు వేచి ఉండాలి.. ఆ తర్వాత నీటితో కలిపి వాటి తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య పూర్తి నయం అవుతుంది. ఈ నీటిని గింజలతో కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
3. బరువు తగ్గుతుంది
బెల్లిఫ్యాట్, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది ఓ వరం అని చెప్పాలి. ఇలాంటివారికి తులసి గింజలు దివ్యౌషధం కంటే తక్కువ కాదు. ఎందుకంటే వాటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలను తినడం వల్ల, ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. దాని కారణంగా బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
4. ఒత్తిడి దూరమవుతుంది
తులసి గింజలు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరు డిప్రెషన్ లేదా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే.. తులసి గింజలను ఖచ్చితంగా తినండి. ఇలా చేయడం వల్ల ఆందోళన దూరమవుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం