Pregnancy Tips: గర్భిణీలు మొబైల్ ఫోన్లు వాడొచ్చా.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..

|

Jan 28, 2023 | 9:10 PM

ప్రస్తుతం మారిపోయిన లైఫ్ స్టైల్ మొబైల్ ఫోన్లు చాలా ఇంపార్టెంట్ వస్తువుగా మారిపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఫోన్ లేనిదే కాలు కదలదు. అన్ని పనులు ఫోన్ తోనే. అయితే.. ఎక్కువగా వాడటం..

Pregnancy Tips:  గర్భిణీలు మొబైల్ ఫోన్లు వాడొచ్చా.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Pregnancy
Follow us on

ప్రస్తుతం మారిపోయిన లైఫ్ స్టైల్ మొబైల్ ఫోన్లు చాలా ఇంపార్టెంట్ వస్తువుగా మారిపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఫోన్ లేనిదే కాలు కదలదు. అన్ని పనులు ఫోన్ తోనే. అయితే.. ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి హానికరం అని మనందరం వింటూనే ఉన్నాం. మహిళల గర్భధారణ సమయంలో మొబైల్ ఫోన్ వాడకం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. గర్భిణీలు అధిక మొత్తంలో మొబైల్ రేడియేషన్‌కు గురైనట్లయితే.. పుట్టిన తర్వాత శిశువు జీవితకాల ప్రవర్తనా సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని కనుగొన్నారు. వాస్తవానికి మనం మొబైల్, ల్యాప్‌టాప్ లేదా ఏదైనా రకమైన వైఫై లేదా వైర్‌లెస్ పరికరాలను ఉపయోగించినప్పుడు దాని నుంచి విద్యుదయస్కాంత రేడియో తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఈ తరంగాలు మన శరీరంలోని డీఎన్ఏను దెబ్బతీస్తాయి. దీని ప్రభావం దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారవచ్చు. కడుపులో ఉండే పిండం డీఎన్ఏపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.

గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో అలాగే మొబైల్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ వాడకం పిల్లలపై పెద్దగా ప్రభావం చూపదని వివిధ పరిశోధనలు కనుగొన్నాయి. కానీ 24 గంటల సెల్ ఫోన్ రేడియోధార్మికత తల్లి, బిడ్డల జ్ఞాపకశక్తి, మెదడు అభివృద్ధిపై దుష్ప్రభావం చూపుతుంది. అలాంటి పిల్లల్లో డెలివరీకి ముందు మరియు తర్వాత అధిక రక్తపోటు పెరుగుతుందని పరిశోధనలో కనుగొన్నారు. కాలక్రమేణా ఈ సమస్య పెరుగుతుంది. అంతే కాదు.. పిల్లల భాష, సంభాషణపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

కాబట్టి.. ఇంట్లో వైఫై లేదా బ్లూటూత్ పరికరాల వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. మొబైల్‌కు బదులు ల్యాండ్‌లైన్ ఫోన్ ఉపయోగిస్తే మంచిది. రేడియో, మైక్రోవేవ్, ఎక్స్-రే యంత్రం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. రేడియేషన్ గర్భిణీ స్త్రీలలో మెదడు కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ఇది అలసట, ఆందోళన, నిద్రకు భంగం కలిగిస్తుంది. గర్భిణీలు ఫోన్ ఎక్కువగా వాడినా.. ఇంటికి దగ్గరగా ఉన్నవారు వాడినా పిల్లల ప్రవర్తనలో 50 శాతం మార్పు వస్తుంది. కాబట్టి గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు వాడకూడదు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..