చాలా మంది బరువు తగ్గడానికి కష్టపడుతుంటారు. అందుకు వర్కవుట్స్, డైటింగ్ చేస్తారు. కానీ కొందరు మాత్రం బరువు పెరిగేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. స్థూలకాయులు, స్థూలకాయులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా.. సన్నగా ఉన్నవారు కూడా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. లావుగా ఉన్నవాళ్లను ఎగతాళి చేసినట్లే, సన్నగా ఉండేవాళ్లను కూడా ఎగతాళి చేస్తారు. అయితే.. ఎలగైనా బరువు పెరగాలనే ఆలోచనతో ఎక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది కాదు. అంతే కాకుండా జంక్ ఫుడ్, మసాలా ఫుడ్స్, డీప్ ఫ్రై ఆహారాన్ని అధికంగా తీసుకుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచి పని కాదు. ఇది ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. బరువు పెరగడానికి ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ లేదా స్వీట్లు తింటారు. కానీ ఇది అనారోగ్యకరమైన బరువు పెరగడానికి దారితీస్తుంది. దాని వల్ల అనేక వ్యాధులు కూడా వస్తాయి.
త్వరగా మరియు ఆరోగ్యంగా బరువు పెరగడానికి నెయ్యితో చేసిన పూరీని తీసుకోవడం మంచిది. ఆయుర్వేదంలో దీనిని నేతిపూరి అంటారు. ఇది సంస్కృతంలో ఘృత్పురా అంటారు. నెయ్యిలో ముంచినది అని దీని అర్థం. బరువు పెరగడానికి నేతిపూరీలు తినాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇది బరువును ఆరోగ్యకరమైన రీతిలో పెంచుతుంది. కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. శరీరానికి పోషణ లభిస్తుంది. బరువు పెరుగుతుంది. శరీరాన్ని బలపరుస్తుంది. పునరుత్పత్తి కణజాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎముకలు, కీళ్లు, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తం కణజాలాలకు పోషణనిస్తుంది.
ఒక గిన్నెలో గోధుమ పిండి, పాలు, కొబ్బరి, నెయ్యి మొదలైనవి వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత వాటిని పూరీల్లా వత్తుకుని.. వేడివేడి నెయ్యిలో వేయించుకోవాలి. అంతే.. నేతిపూరీలు రెడీ. వీటిని చట్నీ లేదా పికిల్ తో తింటే టేస్ట్ తో పాటు హెల్త్ కాడా సొంతం చేసుకోవచ్చు. సన్నగా ఉండి బరువు పెరగాలనుకునేవారు, పోషకాహార లోపం ఉన్నవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు, ఎముకలు, కీళ్లు బలహీనంగా ఉన్న వారు మాత్రమే నేతిపూరీలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..