Raw Papaya: మగవారికి పచ్చి బొప్పాయి అద్భుత వరం.. ఆ ప్రమాదం తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్..

|

Feb 15, 2023 | 9:30 AM

ప్రకృతి అందించిన అద్భుతమైన పదార్థాల్లో బొప్పాయి ఒకటి. వీటిని తనడం వల్ల విటమిన్ ఏ తో పాటు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పండిన బొప్పాయి మాత్రమే కాకుండా.. పచ్చి బొప్పాయితోనూ ఆరోగ్య..

Raw Papaya: మగవారికి పచ్చి బొప్పాయి అద్భుత వరం.. ఆ ప్రమాదం తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్..
Raw Papaya
Follow us on

ప్రకృతి అందించిన అద్భుతమైన పదార్థాల్లో బొప్పాయి ఒకటి. వీటిని తనడం వల్ల విటమిన్ ఏ తో పాటు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పండిన బొప్పాయి మాత్రమే కాకుండా.. పచ్చి బొప్పాయితోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఉన్నాయి. పండ్లు అనేక పోషకాలు కలిగి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. పచ్చి బొప్పాయి మొక్క క్యారికేసి కుటుంబానికి చెందింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఉన్నాయి. పచ్చి బొప్పాయి శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. బ్యాక్టీరియాను బయటకు తీయడంలో ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయి తీసుకోవడం వల్ల ప్రోస్టేట్, పెద్ద పేగు క్యాన్సర్ వంటి పురుషులలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పచ్చి బొప్పాయిలో ఎంజైమ్‌లు ఉన్నాయి. పాపైన్, చైమోపాపైన్ వంటి ఫైటోన్యూట్రియెంట్‌లు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త కణాలకు బిల్డింగ్ బ్లాక్‌లుగా పనిచేస్తాయి. వాపు, మలబద్ధకం, నొప్పిని నివారిస్తాయి. పచ్చి బొప్పాయి శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లేదా ఋతు తిమ్మిరితో సహా ఇతర శరీర వాపులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలో పొటాషియం, ఫైబర్, ఫోలేట్ ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని అరికట్టడంలో గొప్ప ప్రయోజనకారిగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి