Dark circles under Eye: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయో తెలుసా? వాటి నివారణకు ఏం చేయాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు

|

Jan 30, 2023 | 3:13 PM

మితిమీరిన డిజిటల్ వస్తువుల వినియోగం కూడా మనిషిపై అంతే ప్రతికూల పరిణామాలను తీసుకొస్తోంది. ముఖ్యంగా మనిషి కళ్లకు చేటు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే నీలి కాంతి మన కళ్ళకు హాని కలిగిస్తుంది.

Dark circles under Eye: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయో తెలుసా? వాటి నివారణకు ఏం చేయాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు
Screen Time
Follow us on

అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత మనిషికి చాలా పనులను సులభతరం చేసింది. ప్రపంచాన్ని అరచేతిలో నిక్షిప్తం చేసింది. అయితే మితిమీరిన డిజిటల్ వస్తువుల వినియోగం కూడా మనిషిపై అంతే ప్రతికూల పరిణామాలను తీసుకొస్తోంది. ముఖ్యంగా మనిషి కళ్లకు చేటు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే నీలి కాంతి మన కళ్ళకు హాని కలిగిస్తుంది. కరోనా మహమ్మారి సంక్షోభం సమయంలో ఈ పరికరాల వినియోగం పెరగడంతో, మన కళ్లపై ప్రభావాలు కూడా మరింతగా పెరిగాయి. ఈ ప్రభావాలలో ఒకటి కళ్ల కింద నల్లటి వలయాలు(డార్క్ సర్కిల్స్) ఏర్పడటం. ఇవి చూడటానికి చాలా ఇబ్బంది ఉంటాయి. అందుకనే వీటిని తగ్గించుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

డార్క్ సర్కిల్స్ అంటే..

కంటి చుట్టూ ఉన్న డార్క్ మెరూన్ ఆర్బిక్యులారిస్ ఓక్యులి కండరం ప్రతిబింబించడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. కంటి చుట్టూ ఉన్న చర్మం సన్నగా ఉంటుంది. ఈ డార్క్ పిగ్మెంటేషన్‌ను సులభంగా ప్రతిబింబిస్తుంది, అలసిపోయినట్లు లేదా అనారోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. స్క్రీన్‌ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి కూడా చర్మాన్ని పొడిగా చేస్తోంది. ఇది డార్క్ సర్కిల్స్ లను తీవ్రతరం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ డార్క్ సర్కిల్స్ ను ఎలా వదిలించుకోవాలి? నివారణ మార్గాలు ఏంటి? స్క్రీన్ సమయం తగ్గించుకుంటే ఈ డార్క్ సర్కిల్స్ పోతాయా? నిపుణులు చెబుతున్న మార్గాలివి..

ఇవి కూడా చదవండి

చర్మ సంరక్షణకు చర్యలు తీసుకోండి..

  • మీ చర్మ సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా C,E, K విటమిన్లు అధికంగా ఉండే మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. దానిని సవ్యదిశలో, అపసవ్య దిశలో సున్నితమైన వృత్తాకార కదలికలలో సున్నితంగా మసాజ్ చేయాలి.
  • నిద్రకు ఉపక్రమించే 40 నిమిషాల ముందు అండర్ ఐ క్రీమ్ రాసుకోండి.
  • గ్రీన్ టీ బ్యాగులు నల్లటి వలయాలను తగ్గించే రక్త నాళాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
  • సక్రమంగా నిద్రపోవడం వల్ల నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.
  • డిజిటల్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు తరచుగా విరామం తీసుకోండి. స్క్రీన్ గ్లేర్‌ను తగ్గించడానికి ఓవర్‌హెడ్ లైటింగ్‌ను తగ్గించండి.
  • మీ కళ్ళను స్క్రీన్ నుండి ఒక చేయి దూరంలో ఉంచండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..