Health News: అర్ధరాత్రి భోజనం చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

|

Apr 03, 2022 | 6:39 PM

Health News: ఆధునిక కాలంలో బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది సమయపాలన లేకుండా భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం లేట్ నైట్ ఫుడ్ తినడం ఓ ఫ్యాషన్ అయిపోయింది.

Health News: అర్ధరాత్రి భోజనం చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
Late Night Food
Follow us on

Health News: ఆధునిక కాలంలో బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది సమయపాలన లేకుండా భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం లేట్ నైట్ ఫుడ్ తినడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. కానీ అది ఆరోగ్యానికి చాలా హానికరం. కొన్నిసార్లు ఆలస్యం అయితే ఫర్వాలేదు కానీ అన్నిసార్లు ఆలస్యంగా భోజనం చేయడం మంచిది కాదు. వాస్తవానికి రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తినకూడదని నిపుణులు చెబుతున్నారు. లేట్ నైట్ ఫుడ్ తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఈటింగ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిజానికి, అలసట కారణంగా ఇది జరుగుతుంది. అలసట కారణంగా ఓ వ్యక్తి త్వరగా శక్తిని తెచ్చుకునేందుకు ఆహారాన్ని తీసుకుంటాడు. ఒక ప‌రిసోధ‌న‌లో రాత్రి భోజనం, నిద్రకు మధ్య 3 గంటల సమయం ఉండాలని తెలిపారు. అప్పుడే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణింకాగలదు. అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

1. ఫాస్ట్‌గా ఫుడ్ తినడం మానుకోండి: ఈ నియమం అన్ని సమయాలలో వర్తిస్తుంది. ఆహారం ఎప్పుడైనా నెమ్మదిగా తీసుకోవాలి. కానీ చాలామంది రాత్రిపూట ఫాస్ట్‌గా తిని పడుకుంటారు. ఇది మంచి పద్దతి కాదు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలి. ఆహారం తిని పడుకోవడానికి మధ్య ఒక చిన్న నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రస్తుత కాలంలో చాలామంది దీనిని విస్మరిస్తు్న్నారు.

2. అసిడిటీ: ప్రతిరోజూ అర్థరాత్రి ఆహారం తీసుకుంటే ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. గుండెల్లో మంట సమస్యను పెంచుతుంది. కొన్నిసార్లు పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే అర్థరాత్రి తినే అలవాటును మార్చుకుని సమయానికి ఆహారం తీసుకుంటే మంచిది.

3. ఎక్కువ ఆహారం తినవద్దు: కొంతమంది రాత్రిపూట అధిక ఆహారం తింటారు. కానీ ఇది అస్సలు మంచిదికాదు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట భారీ ఆహారాన్ని తినకూడదు. దీని వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, నిద్రభంగం మొదలైన సమస్యలు ఏర్పడుతాయి.

4. సరైన సమయంలో ఆహారం తినండి: ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట తినడానికి సరైన సమయం ఏడు గంటలు. దీనిని చాలామంది పాటించరు. అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల ఒకటి కాదు అనేక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Coffee: కాఫీతో ప్రయోజనాలు అనేకం.. చర్మం, జుట్టు సమస్యలు తొలగించడంలో సూపర్..!

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన చిరుత.. తన ఫ్రెండ్‌ జోలికొస్తే ఊరుకుంటుందా..!

Cricket Photos: తండ్రి, మేనమామ వారసత్వంగా క్రికెట్‌లోకి ఎంట్రీ.. ఇప్పుడు ప్రపంచంలోనే డేంజర్ బ్యాట్స్‌మెన్‌..!