Chapatis At Night: రాత్రిపూట చపాతీలు తింటున్నారా.? అయితే మంచిదో.. కాదో.. తెలుసుకోండి.!

|

May 22, 2021 | 11:14 AM

Chapatis At Night: బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి, అలాగే బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలామంది యువత...

Chapatis At Night: రాత్రిపూట చపాతీలు తింటున్నారా.? అయితే మంచిదో.. కాదో.. తెలుసుకోండి.!
Chapati
Follow us on

Chapatis At Night: బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి, అలాగే బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఎక్కువగా రాత్రి వేళల్లో అన్నం మానేసి చపాతీలు తింటుంటారు. అయితే ఉన్నఫలంగా అన్నం మానేసి చపాతీలు తినడం మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. ఒక పూట అన్నం పూర్తిగా మానేసే బదులు.. అన్నం తక్కువ తీసుకుని.. ఆ స్థానంలో చపాతీలు తినమని సూచిస్తున్నారు. అలాగే రాత్రిపూట వేడివేడిగా చేసుకునే చపాతీలు కంటే నిల్వ ఉన్న చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే అప్పటికప్పుడు చేసిన చపాతీల్లో నూనె కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

సాధారణంగా ఎక్కువ సేపు నిల్వ ఉండే ఆహార పదార్ధాలలో పోషకాలు అంతమైపోతాయి. అయితే చపాతీలు, రోటీలు ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని డాక్టర్లు తెలిపారు. అందుకే రాత్రిపూట నిల్వ ఉంచిన చపాతీలు తినాలని.. అలా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్, అల్సర్స్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత రోగాలు దరికి చేరవని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు రక్త హీనతతో బాధపడుతున్న వారికి కూడా చపాతీలు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందట.

చపాతీలను మరింత టేస్టీగా చేసుకునేందుకు ఈ టిప్స్ పాటించండి…

  • చపాతీలను బార్లీ, మిల్లెట్స్, జొన్నలతో కూడా చేసుకోవచ్చు. వీటిల్లో న్యూట్రిన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో అవసరం
  • బీన్స్, క్యారెట్, పాలకూర వంటివి ఉడికించి చపాతీ పిండిలో కలుపుకోవచ్చు.
  • చపాతీల కోసం హోల్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి వాడటం ఎంతో మంచిది
  • గోధుమ పిండితో పాటూ రాగి పిండి, సోయా బీన్ ఫ్లోర్, సజ్జ పిండి కలిపి చపాటీలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది
  • చపాతీలు చేసేటప్పుడు బటర్, నూన్, నెయ్యి వాడకండి

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!