సాధారణంగా సోంపు గింజలు(Anise) మనకు తిన్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది.. ఎక్కడికైనా రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లినప్పుడు తప్పకుండా భోజనం(Food) చేసిన తర్వాత అక్కడి మేనేజ్‌మెంట్ వారు సోంపు గింజలను కూడా తినడానికి పెడతారు. ఇక ఈ సోంపు గింజలలో మనకు జింక్(Zink), క్యాల్షియం, సెలీనియం వంటి ఖనిజాలు బాగా లభిస్తాయి. సోంపు గింజలతో తయారు చేసిన పేస్ట్ ను ముఖంపై రాయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఇవి రక్తప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇక సోంపు గింజలు తినడం వల్ల చర్మం పొడిబారి పోకుండా ఉండడమే కాకుండా చర్మంపై వచ్చే దద్దుర్లు రావు.
వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల శరీరంలోకి చేరిన వైరస్, బ్యాక్టీరియాను దూరం చేయడంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాదు సోంపు ఎసెన్షియల్ ఆయిల్‌తో పాటు ఫైబర్ కూడా ఉండడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి. సోంపు గింజల్లో ఫెన్‌కాన్, అనెథాల్, ఎస్ట్రాగోల్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండడం వల్ల మలబద్ధకం,అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేసి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
రక్తాన్ని శుద్ధి చేయడంలో సోంపు గింజలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రతిరోజు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు సోంపు గింజలతో తయారు చేసిన టీని కూడా తాగడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉండవు. సోంపు గింజలలో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి చూపు మెరుగుపడుతుంది. సోంపు గింజలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల తిన్న తర్వాత వీటిని తింటే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. అంతేకాదు గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.
Read Also.. Sugarcane Juice: ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసం అస్సలు తాగకూడదు.. ఎందుకంటే..