Health Tips: నేలపై కూర్చొని ఆహారం తినాలి.. శరీరానికి 5 అద్భుత ప్రయోజనాలు..!

|

May 31, 2022 | 6:54 AM

Health Tips: భారతీయ సంస్కృతిలో నేలపై కూర్చొని ఆహారం తినడం ఉత్తమంగా చెబుతారు. ఈ విషయం గ్రంథాలలో కూడా చెప్పారు. దీని వెనుక లోతైన శాస్త్రం దాగి ఉంది.

Health Tips: నేలపై కూర్చొని ఆహారం తినాలి.. శరీరానికి 5 అద్భుత ప్రయోజనాలు..!
Sitting On The Floor
Follow us on

Health Tips: భారతీయ సంస్కృతిలో నేలపై కూర్చొని ఆహారం తినడం ఉత్తమంగా చెబుతారు. ఈ విషయం గ్రంథాలలో కూడా చెప్పారు. దీని వెనుక లోతైన శాస్త్రం దాగి ఉంది. నేలపై కూర్చొని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

1. నేలమీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఊబకాయం పెరగదు

నేలపై కూర్చొని తినడం వల్ల మన శరీరం చాలా నిటారుగా ఉంటుంది. దీని వల్ల ఆహారం తిన్నప్పుడు అది నేరుగా జీర్ణాశయం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం దృష్టి ఆహారంపైనే ఉంటుంది. తద్వారా మీరు అతిగా తినకుండా ఉంటారు. దీని వల్ల బరువు అదుపులో ఉండి ఊబకాయం రాదు.

ఇవి కూడా చదవండి

2. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది

నేలపై కూర్చున్నప్పుడు మన శరీరంలోని రక్తనాళాలు సక్రమంగా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. ఆహారం వల్ల ఉత్పత్తి అయ్యే రక్తం ఈ గొట్టాల ద్వారా మీ తల నుంచి కాలి వరకు సులభంగా ప్రసరిస్తుంది. మంచం లేదా కుర్చీపై కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఇది జరగదు.

3. కుటుంబంలో సామరస్యం, ఐక్యత నెలకొంటాయి

నేలపై కూర్చొని భోజనం చేస్తే కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. దీంతోపాటు ఆహారం వృథా కాదు. తినే ఆహారం విలువ తెలుస్తుంది. ఇది పాత తరం నుంచి తరువాతి తరానికి అందిస్తున్న సంస్కృతి.

4. ఎసిడిటీ, గ్యాస్‌ని దూరం చేస్తుంది

నేలపై కూర్చొని భోజనం చేయడం శరీరంలోని జీర్ణవ్యవస్థకు మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ ఏర్పడే సమస్య ఉండదు. దీంతో పాటు ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు రోజూ ఉదయం, సాయంత్రం నేలపై కూర్చొని ఆహారం తీసుకుంటే మీ మోకాళ్లకు వ్యాయామం జరుగుతుంది. అవి మీ శరీర బరువును ఎక్కువసేపు భరించగలవు.

5. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది

మీరు ముందుకు వంగి ఆహారం తీసుకొని ఆపై నిటారుగా ఉన్న భంగిమలో రావాలి. ఇలా చేయడం ద్వారా మీరు తిన్న ఆహారం అలిమెంటరీ కెనాల్ ద్వారా నేరుగా జీర్ణవ్యవస్థకు చేరుతుంది. దీని వల్ల కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయటపడతారు. దీనివల్ల వెన్నెముక ఫిట్‌గా ఉంటుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి