Fertility Issues: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల వల్ల అమ్మ అనే పిలుపు దూరం.. నిపుణులు చెప్పే వివరాలు తెలిస్తే షాక్‌..!

యునైటెడ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ ప్రవర్తనపై చలనచిత్రాల ప్రభావం, ఐవీఎఫ్‌కు సంబంధించిన ప్రాముఖ్యత, నాయకత్వం, మరిన్ని వంటి అంశాలపై చర్చించేలా ఇటీవల టెడ్‌ ఎక్స్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. టెడ్‌ ఎక్స్‌ అనేది గ్లోబల్-స్థాయి ఈవెంట్. ఇందులో అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందిన వ్యక్తులు స్థానికంగా నడిచే ఆలోచనలను జరుపుకోవడానికి వేదికను పంచుకుంటారు. వాటిని ప్రపంచ స్థాయికి ఎలివేట్ చేస్తారు. ఈ ఈవెంట్‌లో నిపుణులు ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌ వాడడం వల్ల కలిగే నష్టాలను వెల్లడించారు.

Fertility Issues: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల వల్ల అమ్మ అనే పిలుపు దూరం.. నిపుణులు చెప్పే వివరాలు తెలిస్తే షాక్‌..!
Fertility Issues

Updated on: Jan 29, 2024 | 6:30 AM

ప్రస్తుత రోజుల్లో పెరిగిన టెక్నాలజీ కొత్తకొత్త సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్లు అనేవి మన జీవితంలో ఓ భాగంగా మారాయి. ప్రతి క్షణం స్మార్ట్‌ఫోన్‌ చేతుల్లో ఉంటే.. పని ప్రదేశంలో మాత్రం ల్యాప్‌టాప్‌లు తప్పనిసరయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిని అధికంగా వాడడం వల్ల సంతానసాఫల్య సమస్యలు వస్తున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ ప్రవర్తనపై చలనచిత్రాల ప్రభావం, ఐవీఎఫ్‌కు సంబంధించిన ప్రాముఖ్యత, నాయకత్వం, మరిన్ని వంటి అంశాలపై చర్చించేలా ఇటీవల టెడ్‌ ఎక్స్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. టెడ్‌ ఎక్స్‌ అనేది గ్లోబల్-స్థాయి ఈవెంట్. ఇందులో అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందిన వ్యక్తులు స్థానికంగా నడిచే ఆలోచనలను జరుపుకోవడానికి వేదికను పంచుకుంటారు. వాటిని ప్రపంచ స్థాయికి ఎలివేట్ చేస్తారు. ఈ ఈవెంట్‌లో నిపుణులు ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌ వాడడం వల్ల కలిగే నష్టాలను వెల్లడించారు. నిపుణులు వెల్లడించిన షాకింగ్‌ ఫ్యాక్ట్స్‌ను ఓ సారి తెలుసుకుందాం.

టెడ్‌ ఎక్స్‌ ఈవెంట్‌లో మానవ మనస్సు, ప్రవర్తనపై సినిమాల ప్రభావంపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలే సమాజానికి అద్దం అన్నారు. అవి ఒకరి వైఖరి, ప్రవర్తన, ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వారు మన యువ తరానికి ఏమి అందిస్తున్నారో చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని నిపుణులు పేర్కొన్నారు. అదేవిధంగా ఐవీఎఫ్‌, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టులు ఐవీఎఫ్‌కు సంబంధించిన ప్రాముఖ్యత గురించి, అలాగే అమ్మ అయ్యేందుకు ఈ విధానం ఎలా సహాయపడుతుందనే దానిపై మాట్లాడారు. 40 శాఆతం కేసుల్లో వంధ్యత్వానికి పురుషులు మాత్రమే కారణమని తేలిందని ఆమె చెప్పారు.

వంధ్యత్వానికి కారణమయ్యే కారకాలను జాబితా చేస్తూ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌ల మితిమీరిన వినియోగం ఈ రోజుల్లో సంతానోత్పత్తి రేటును కూడా ప్రభావితం చేస్తోందని పలువరు పేర్కొన్నారు. అందువల్ల వీలైనంత వరకు వారితో దూరం పాటించాలని సూచించారు. అలాగే పలువరు వయస్సు గురించిన ముందస్తు షరతులపై తన అనుభవాలను పంచుకున్నారు. వయస్సు గురించి ఆలోచించకుండా జీవితాన్ని ఆనందంగా గడపాలని పేర్కొన్నారు. ముఖ్యంగా స్ఫూర్తి పొందే కథలు తెలుసుకోవడం జీవితంలో ముందుకు సాగేందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కళాశాల నుంచే మొబైల్‌ ఫోన్‌ దూరంగా ఉండాలని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి