Corona Patients Home Isolation: మీకు కరోనా సోకిందా.? హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారా.! అయితే మీరు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి దగ్గరే ఉంటూ కరోనాకు చికిత్స తీసుకుంటున్నవారు ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? అనే విషయాలపై వైద్య నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఏం చేయాలి…
గాలి, వెలుతురు ఉండే రూమ్‌లో ఒంటరిగా ఉండాలి
చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలి
ఎప్పుడూ మాస్క్ ధరించాలి
మీరు ఉపయోగించే వస్తువులను వేరుగా ఉంచుకోవాలి
నాలుగు గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవెల్, టెంపరేచర్ చెక్ చేసుకోవాలి
ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకోవాలి.
ఆక్సిజన్ లెవెల్ పెంచుకునేందుకు ప్రోనింగ్(Proning) ఎక్స్‌ర్‌సైజ్ చేయాలి.
రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాలి.
మల్టీ విటమిన్లు, మినరల్స్, రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
ఏం చేయకూడదు..!
ప్రిస్క్రిప్షన్ లేకుండా గూగుల్‌లో చూసి ఇష్టానుసారంగా మందులు వాడకూడదు.
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు రెమ్‌డిసివర్ ఇంజక్షన్‌ను ఉపయోగించకూడదు.
డాక్టర్ల సలహా తీసుకోకుండా ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగించకూడదు.
ఒంటరిగా ఫీల్ అవుతున్నామని ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు.