ఇయర్ బడ్స్(Ear buds), లేదా అగ్గిపుల్లకు దూది చుట్టి చెవిలో జివిలి(Earwax) తీస్తారు. కొన్ని సందర్భాల్లో కాంటను కూడా ఉపయోగిస్తారు. ఈవన్నీ చెవికి చాలా ప్రమాదకరం. అసలు చెవిలో ఉండే జివిలి గురించి మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మన చెవిలో పేరుకుపోయే జివిలిని ఆటోమేటిగ్గా క్లీన్ చేసుకునే వ్యవస్థ డీఎన్ఏ(DNA)లోనే నిక్షిప్తమై ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రత్యేకంగా ఇయర్ బడ్స్‌తో మనం చెవులను శుభ్రం చేసుకోవాల్సిన పని లేదని చెబుతున్నారు. మన చెవి ఎప్పటికప్పుడు ఇయర్ వ్యాక్స్‌ను (జివిలి) విడుదల చేస్తూనే ఉంటుంది. ఇది మన ఇయర్ కెనాల్స్‌ని రక్షిస్తుంది. ఇది సహజంగానే లోపలి నుంచి బయటకు వచ్చేస్తుంటుంది. స్నానం చేసినప్పుడు ఆటోమేటిగ్గా శుభ్రమవుతుంది.
చెవుల్లో కాటన్ ఇయర్ బడ్స్‌ను దూర్చి క్లీన్ చేయడం ద్వారా ఇయర్ కెనాల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇయర్ వ్యాక్స్ మరింత లోపలికి వెళ్లి.. అది గట్టిగా మారితే శుభ్రపరచడం కష్టమవుతుందని వివరిస్తున్నారు. ఇలాంటి చర్యలు చెవిపోటు లేదా చెవికి సంబంధించిన ఇతర ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చునని హెచ్చరిస్తున్నారు. ఇయర్ బడ్స్‌తో చెవులను క్లీన్ చేయడం ద్వారా ఫలితమేమీ ఉండదని.. దానివల్ల నష్టమే ఎక్కువని చెబుతున్నారు.
ఇయర్ వ్యాక్స్‌ను మెడికల్‌గా సెరుమెన్‌గా పిలుస్తారు. ఇది నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చెవి ఎండిపోదు. చెవి లోపలికి దుమ్ము, ధూళి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అలాగే బాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని లోపలికి చేరనివ్వదు. ఇయర్ వ్యాక్స్ విడుదల ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు. కొంతమందిలో తక్కువగా ఉండొచ్చు. ఏదేమైనా ఇది సహజమేనని తెలుసుకోవాలి.
Note :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read also.. Anemia: ఈ పదార్ధాలతో కూడా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.. అవేంటో తెలుసుకోవడం మీకే మంచిది..