Papaya: బొప్పాయి తింటున్నారా.? వీరి ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..

ఇందులోని విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే పీచు వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే బొప్పాయి.. కొందరికీ మాత్రం చాలా ప్రమాదకరమని...

Papaya: బొప్పాయి తింటున్నారా.? వీరి ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..
Papaya Side Effects

Updated on: Jan 13, 2024 | 7:11 PM

కాలంతో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రుచితోపాటు, ఆరోగ్యపరంగా కూడా బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే పీచు వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే బొప్పాయి.. కొందరికీ మాత్రం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతన్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇంతకీ బొప్పాయిని ఎవరి తీసుకోకూడదు.? తీసుకుంటే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* కిడ్నీ సమస్యతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు బొప్పాయి తీసుకోవడం వల్ల ఆ్సలేట్‌ సమస్య పెరుగుతుంది. కాబట్టి కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు బొప్పాయికి దూరంగా ఉండడమే మంచిది.

* గుండె వేగంగా లేదా మరీ నెమ్మదిగా కొట్టుకునే వారు బొప్పాయికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఉండే సైనోజెనిక్ గ్లైకోసైడ్.. అమైనో ఆమ్లం లాంటిది. ఇది హృదయ స్పందన సమస్యలను దారి తీస్తుంది.

* గర్భిణీలు బొప్పాయికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయి తీసుకోవడం వల్ల గర్భిణీల్లో ఆబార్షన్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బొప్పాయిలో పాపైన్ ఉంటుంది, ఇది శరీరంలోని ప్రోస్టాగ్లాండిన్ ప్రసవ నొప్పిని కృత్రిమంగా ప్రేరేపిస్తుందని చెబుతున్నారు.

* ఇక అలర్జీలతో బాధపడే వారు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత అలర్జీలతో బాధపడే వారిలో బొప్పి ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

* కామెర్ల సమస్యతో బాధపడేవారు బొప్పాయి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని పాపైన్, బీటా కెరోటిన్ అనే ఎలిమెంట్స్ కామెర్ల సమస్యను మరింత పెంచుతాయి. అందుకే వీరు బొప్పాయిని అస్సలు తినకూడదు.

* సాధారణం కంటే ఎక్కువ రక్తం ఉన్నవారు కూడా బొప్పాయిని తినొద్దని నిపుణులు చెబుతున్నారు. రక్తం సాధారణ స్థితికి చేరుకోవడానికి మందులు ఉపయోగించే వారు ఆ సమయంలో బొప్పాయికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

* షుగర్‌ పేషెంట్స్‌ కూడా బొప్పాయికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి మందులు ఉపయోగిస్తున్న వారు బొప్పాయికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..