AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్ మందులు మెదడుపైనా ప్రభావం చూపుతాయా? తాజా పరిశోధనలో సంచలన నిజాలు!

Metformin: చాలా కాలంగా మధుమేహ చికిత్సలో ఉపయోగిస్తున్న మెట్‌ఫోర్మిన్ రక్తంలో చక్కెరను నియంత్రించే విధానంపై తాజా అధ్యయనం కొత్త కోణాన్ని చూపించింది. ఇప్పటివరకు ఇది కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తుందని భావించగా, కొత్త పరిశోధనలు ఇది ప్రేగులపై కూడా ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి.

డయాబెటిస్ మందులు మెదడుపైనా ప్రభావం చూపుతాయా? తాజా పరిశోధనలో సంచలన నిజాలు!
Diabetes
Rajashekher G
|

Updated on: Mar 28, 2026 | 4:14 PM

Share

ఇటీవల కాలంలో మధుమేహం (Diabetes) బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, మధుమేహానికి సంబంధించిన చికిత్సకు ఉపయోగించే మందులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మందులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 60 సంవత్సరాలకు పైగా మధుమేహ చికిత్సలో ప్రధానంగా ఉపయోగిస్తున్న మెట్‌ఫోర్మిన్ (Metformin) ఔషధం రక్తంలో చక్కెరను ఎలా నియంత్రిస్తుందనే విషయంపై తాజా అధ్యయనం కొత్త కోణాన్ని చూపించింది. ఇప్పటివరకు ఇది ప్రధానంగా కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తుందని భావించేవారు. కొంతమంది పరిశోధనలు ఇది ప్రేగులపై కూడా ప్రభావం చూపుతుందని సూచించాయి.

మెదడుపై ప్రభావం

అమెరికాలోని Baylor College of Medicineకు చెందిన శాస్త్రవేత్త Makoto Fukuda నేతృత్వంలోని బృందం, ఈ ఔషధం మెదడుపై కూడా ప్రభావం చూపుతుందేమో అనే దానిపై పరిశోధన చేసింది. ఎందుకంటే మెదడు మొత్తం శరీర గ్లూకోజ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం.. Metformin మెదడులోని వెంట్రోమీడియల్ హైపోథాలమస్ (VMH) అనే భాగంలో పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న Rap1 అనే ప్రోటీన్‌ను అణచివేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే SF1 న్యూరాన్‌లు అనే మెదడు కణాలను ఉత్తేజపరచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

మెరుగైన ఫలితాలు

ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో, Rap1 లేకపోతే మెట్ఫార్మిన్ ప్రభావం కనిపించలేదు. అయితే అదే పరిస్థితుల్లో ఇన్సులిన్, GLP-1 వంటి ఇతర మందులు పనిచేశాయి. మరోవైపు, మెదడులోకి నేరుగా చాలా చిన్న మోతాదులో మెట్ఫార్మిన్ ఇచ్చినప్పుడు కూడా రక్తంలో చక్కెర గణనీయంగా తగ్గింది.

ఈ ఫలితాలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి.. Metformin కేవలం కాలేయం లేదా ప్రేగులలో మాత్రమే కాకుండా, మెదడులో కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా, మెదడు చాలా తక్కువ మోతాదుకే స్పందిస్తుంది. ఈ కొత్త అవగాహన భవిష్యత్తులో మెదడును లక్ష్యంగా చేసుకుని మరింత సమర్థవంతమైన మధుమేహ చికిత్సలను అభివృద్ధి చేయడానికి దారి చూపించవచ్చు.

Follow Us
పొద్దుగూకులు ఏసీలో ఉంటే ఏమవుతుంది..? పెద్ద కథే ఉందిగా..
పొద్దుగూకులు ఏసీలో ఉంటే ఏమవుతుంది..? పెద్ద కథే ఉందిగా..
డయాబెటిస్ మందులు మెదడుపైనా ప్రభావం చూపుతాయా? తాజా స్టడీ షాకింగ్..
డయాబెటిస్ మందులు మెదడుపైనా ప్రభావం చూపుతాయా? తాజా స్టడీ షాకింగ్..
స్టైల్ అనుకుంటే పొరపాటే.. కుకింగ్ ప్యాన్‌కి ఈ రంధ్రం ఎందుకో తెలుస
స్టైల్ అనుకుంటే పొరపాటే.. కుకింగ్ ప్యాన్‌కి ఈ రంధ్రం ఎందుకో తెలుస
దోసె పెనంకు అంటుకుపోతుందా?.. ఈ పొరపాట్లు చేయకండి
దోసె పెనంకు అంటుకుపోతుందా?.. ఈ పొరపాట్లు చేయకండి
ఏప్రిల్ 1 నుంచి టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుందా?
ఏప్రిల్ 1 నుంచి టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుందా?
తులసితో కలిసి భాను ఎంత పని చేసింది.. ప్రియుడు దక్కడనుకుని..
తులసితో కలిసి భాను ఎంత పని చేసింది.. ప్రియుడు దక్కడనుకుని..
అతిగా నిద్రపోతే బరువు పెరుగుతారా?.. అసలు నిజం తెలిస్తే షాకే
అతిగా నిద్రపోతే బరువు పెరుగుతారా?.. అసలు నిజం తెలిస్తే షాకే
లీటర్ డీజిల్‌కు రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది..?
లీటర్ డీజిల్‌కు రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది..?
ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే.. జీవితంలో వెనుకబడటం ఖాయం!
ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే.. జీవితంలో వెనుకబడటం ఖాయం!
2026లో బెస్ట్ బడ్జెట్ విండో ఏసీలు..అదిరిపోయే ఫీచర్లు, అందుబాటు ధర
2026లో బెస్ట్ బడ్జెట్ విండో ఏసీలు..అదిరిపోయే ఫీచర్లు, అందుబాటు ధర