Health Tips: కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది..!

Health Tips: ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, అనారోగ్యపు అలవాట్ల వల్ల చాలామంది ఉదర సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంతో అవస్థ పడుతున్నారు.

Health Tips: కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది..!
Stomach

Updated on: Apr 01, 2022 | 2:28 PM

Health Tips: ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, అనారోగ్యపు అలవాట్ల వల్ల చాలామంది ఉదర సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంతో అవస్థ పడుతున్నారు. దీనికి కారణం అనేకం ఉన్నాయి. వాస్తవానికి కడుపులో గ్యాస్‌ ఏర్పడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం, సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మరికొంతమందికి మలబద్దకం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.

1. బ్రోకలీ

మీకు కడుపు ఉబ్బరం సమస్య ఉంటే బ్రోకలీని తీసుకోకండి. ఎందుకంటే ఇది ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీని కారణంగా సమస్య మరింత జఠిలమవుతుంది.

2. ఆపిల్

ఎవరికైనా కడుపు ఉబ్బరం సమస్య ఉంటే ఆహారంలో యాపిల్‌ చేర్చవద్దు. ఎందుకంటే యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్యాస్ సమస్యలను పెంచడమే కాకుండా కడుపు ఉబ్బరం, నొప్పిని కూడా కలిగిస్తుంది.

3. వెల్లుల్లి

వెల్లుల్లి కడుపు ఉబ్బరం సమస్యను పెంచుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్రక్టాన్లు ఉంటాయి. ఇవి బ్లాటింగ్ సమస్యను మరింత పెంచుతాయి.

4. బీన్స్

బీన్స్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య పెరుగుతుంది. ఉబ్బరం సమస్య ఉన్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండాలి. బీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది డయేరియా, కడుపు నొప్పి సమస్యలని కలిగిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి

Basil water: తులసి నీరు అత్యంత పవిత్రం.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Viral Video: వర్షంలో తడుస్తున్న పిల్లలని రక్షించేందుకు తల్లి పక్షి ఆరాటం.. నెటిజన్ల హృదయాన్ని తాకిన వీడియో..!

Viral Video: తాగుబోతు పెళ్లికొడుకు.. అమ్మాయికి బదులు అత్తగారి మెడలో మాల..!