Health Tips: ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల ప్రకారం భోజనం చేసేటప్పుడు నీరు తాగడానికి దూరంగా ఉండాలి. అలాగే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఆహారం తిన్న వెంటనే నీరు తాగే వ్యక్తులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. చిన్ని పిల్లలు అన్నం తినేటప్పుడు నీరు తీసుకోవచ్చు. కానీ పెద్దవారు అన్నంతినేటప్పుడు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. ఆహారం జీర్ణం కావడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఆహారం తిన్న 45 నుంచి 60 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి. అలాగే ఆహారం తినే అరగంట ముందు నీళ్లు తాగాలని గుర్తుంచుకోండి.
సరైన సమయంలో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. ఆహారం తిన్న గంట తర్వాత నీళ్లు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
2. సరైన సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది.
3. పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉండదు.
4. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది.
5. సరైన సమయంలో నీళ్లు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు
1. ఊబకాయం సమస్యలు
2. జీర్ణక్రియ సమస్యలు
3. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం
4. కడుపులో గ్యాస్ సమస్యలు
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.