Shawarma Terror: షవర్మా తింటే చనిపోతారా?.. నిపుణులు చెబుతున్న ఈ విషయాలను తప్పక చూడాల్సిందే..!

|

May 16, 2022 | 5:34 AM

Shawarma Terror: నిజంగా షవర్మా తింటే పోతారా? షవర్మాలో బ్యాక్టీరియానే కారణమా? బ్యాక్టీరియా ఎలా ఫాం అవుతుంది? మీరు తినే షవర్మా రోజుదా, పూటదా? గంటదా? షవర్మాలో ..

Shawarma Terror: షవర్మా తింటే చనిపోతారా?.. నిపుణులు చెబుతున్న ఈ విషయాలను తప్పక చూడాల్సిందే..!
Shawarma
Follow us on

Shawarma Terror: నిజంగా షవర్మా తింటే పోతారా? షవర్మాలో బ్యాక్టీరియానే కారణమా? బ్యాక్టీరియా ఎలా ఫాం అవుతుంది? మీరు తినే షవర్మా రోజుదా, పూటదా? గంటదా? షవర్మాలో క్వాలిటీ చికెన్‌ వాడుతున్నారా? అందులో వాడే బట్టర్‌ క్వాలిటీ ఏంటి? పదే పదే వేడి చేయడం వల్ల షవర్మా పాడవుతుందా? అమ్ముడుపోని షవర్మాను ఫ్రిజ్‌లో నిల్వ చేసి అమ్ముతున్నారా? కేరళలో షవర్మా తిని విద్యార్థి చనిపోవడంతో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. షవర్మా తిని విద్యార్థి దేవానంద చనిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో షవర్మాతో ఏం జరుగుతుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో షవర్మా గురించి వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సూచనలు చేస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం.

ఫ్రెష్‌గా తయారు చేసిన షవర్మా తింటే మంచిదే. కాని కుళ్లిన, పాడైన షవర్మా తింటే మాత్రం ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు డాక్టర్లు. కొత్త కొత్త జంక్‌ఫుడ్స్‌ ఇప్పుడు మార్కెట్లో కనబడుతున్నాయి. ఆకర్షణీయమైన పేర్లతో కనబడే వంటకాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కేరళలో చికెన్‌తో తయారు చేసిన షవర్మా తిని దేవానంద అనే స్టూడెంట్‌ చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హైదరాబాద్‌లో గల్లీగల్లీలో షవార్మా సెంటర్లు కనబడుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నప్పటికి కేరళలో జరిగిన ఘటన హైదరాబాద్‌లో కూడా జరిగే ప్రమాదముంది. ఎందుకంటే కేరళలో కంటే హైదరాబాద్‌‌లోనే షవర్మా సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా షవర్మా తింటే పోతారా? కేరళలో అమ్మాయి షవర్మా తినే చనిపోయిందా? కేరళ సర్కార్‌ ఏం చెబుతోంది ? షవర్మా చాలా మంది తింటున్నారు.. మరి ఆ అమ్మాయే ఎందుకు చనిపోయింది? షవర్మాలో బ్యాక్టీరియానే కారణమా? అసలు షవర్మాలో బ్యాక్టీరియా ఎలా ఫాం అవుతుంది? ఈవిషయాలపై దృష్టి పెట్టాలంటున్నారు డాక్టర్లు. కేరళలో షవర్మా తిని 58 మంది ఆస్పత్రి పాలయ్యారు. కాని ఆ అమ్మాయి మాత్రమే ఎలా చనిపోయిందన్న విషయంపై ఇంకా పూర్తి నివేదిక రాలేదు.

కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
షవర్మా విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే. మీరు తినే షవర్మా రోజుదా, పూటదా? గంటదా? అని కచ్చితంగా తెలుసుకోవాలి. షవర్మాలో క్వాలిటీ చికెన్‌ వాడుతున్నారా? ఆ చికెన్‌ నాణ్యత ఎంత? అన్న విషయంపై కూడా ఆరా తీయాలి. షవర్మాలో వాడే బట్టర్‌ క్వాలిటీ ఏంటి? షవర్మాలో పెరుగు వాడతారు. నిల్వ ఉంటే పెరుగు పులిచిపోయి పాడవుతోంది. అప్పుడు ఫంగస్‌ ఫామ్‌ అవుతుందా?. ఈవిషయాలపై కూడా దృష్టి పెట్టాలి.

ఇవి కూడా చదవండి

కాగా, షవర్మా సెంటర్ల విషయంలో తమిళనాడు ఆరోగ్యశాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. కుళ్లిపోయిన, పాడైన చికెన్‌తో షవర్మా చేస్తున్న దుకాణాలపై పలు చోట్ల దాడులు నిర్వహించారు. చెన్నై, తిరువళ్ళూరు, కోయంబత్తూరులో తమిళనాడు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు.

వాస్తవానికి షవర్మాను చాలాసార్లు వేడి చేస్తుంటారు. పదే పదే వేడి చేయడం వల్ల షవర్మా పాడవుతుందా? ఈ విషయంపై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. షవర్మా తయారీలో రకరకాల పదార్ధాలు వినియోగిస్తారు. మల్టీపుల్‌ ఐటెమ్స్‌ మిక్స్‌ చేయడం వల్ల షవర్మా తొందరగా పాడయ్యే అవకాశం ఉందా అనేది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. షవర్మా ఎప్పుడు తయారు చేస్తారు? ఎంత సేపు నిల్వ ఉంచుతారు? ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల ఎంత డేమేజ్‌ అవుతుంది? అన్న విషయాలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ముందే జాగ్రత్తలు సూచించాల్సిన అవసరం ఉంది.

పాడైన షవర్మా తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అన్న విషయంపై ప్రజలకు తప్పకుండా అవగాహన ఉండాలి. షవర్మాలో వాడే పదార్ధాలపై క్వాలిటీ చెక్‌ ఉండే అవకాశాలు చాలా తక్కువ. అమ్ముడుపోని షవర్మాను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తునట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఫ్రిజ్‌లో పెట్టి చికెన్‌ను వేడి చేస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే కేరళలో దేవానంద తిన్న షావర్మాలో రెండు రకాల బ్యాక్టీరియాలో కనుగొన్నారు. షిగెల్లాతో పాటు సర్మోనెల్లా అనే బ్యాక్టీరియాలు ఆ షవర్మాలో బయటపడ్డాయి. ఈ బ్యాక్టిరియా కారణంగా డయేరియాతో పాటు జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని డాక్టర్లు తెలిపారు.