

అయితే దగ్గు సాధారణంగా వచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ సోకినట్లు గుర్తించాలని పేర్కొంటున్నారు నిపుణులు. అందుకే బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ బయటకు వెళ్లకపోవడమే మంచిదని పేర్కొంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి దగ్గు వస్తే కరోనా లక్షణాలుగా పరిగణించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పొడి దగ్గు.. కరోనా సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి చాలా మంది బాధితుల్లో పొడిదగ్గు కనిపించింది. కోవిడ్‌తో బాధపడుతున్న 60-80 శాతం రోగులల్లో ప్రారంభదశలో పొడిదగ్గు కనిపించిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

కరోనావైరస్ సంక్రమణకు గురైన బాధితుల్లో పొడి, నిరంతర దగ్గు వస్తుందని పేర్కొన్నారు. పొడి దగ్గు సాధారణంగా ఒక స్థిరమైన ధ్వనిని కలిగి ఉంటుందని.. దీంతోపాటు వాయిస్ కూడా మారుతుందని పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి దగ్గు వల్ల వాయుమార్గంలో వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతుంది.

దగ్గుతోపాటు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా అది వైరస్ సంకేతాలేనని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనావైరస్ సోకిన రోగులు 40 శాతం మంది ప్రారంభ దశలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు గొంతు నొప్పి కూడా ఉంటుందని పేర్కొంటున్నారు.

దగ్గుతోపాటు.. జ్వరం, జలుబు ఉన్నా వైరస్ బారిన పడ్డట్లేనని పేర్కొంటున్నారు. దీనివల్ల వాసనను పసిగట్టలేరని.. కోవిడ్ సోకిన రోగులల్లో ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. కావున ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దని పేర్కొంటున్నారు.