Iron Deficiency: ఈ మూడు రకాల డ్రింక్స్‌తో శరీరంలో ఐరన్‌ లోపం సమస్యలకు చెక్‌..

|

Jan 17, 2023 | 4:36 PM

శరీరంలో ఐరన్‌ లోపిస్తే చిన్న పని చేసినా అలసిపోతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో ఐరన్‌ లోపాన్ని అధిగమించడానికి ఈ మూడు రకాల జ్యూస్‌లు చాలా బాగా పనిచేస్తాయి.

Iron Deficiency: ఈ మూడు రకాల డ్రింక్స్‌తో శరీరంలో ఐరన్‌ లోపం సమస్యలకు చెక్‌..
Iron Rich Drink
Follow us on

మనం ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితంలో ప్రతిదీ సరిగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం తింటున్నాం. పోషకాల కొరత కారణంగా శరీరం బలహీనపడటం ప్రారంభిస్తే, అది అనేక వ్యాధులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. శరీరానికి ఐరన్ కంటెంట్ చాలా ముఖ్యమైన అంశం. ఇనుము లోపం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. మన శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి ఐరన్‌ పనిచేస్తుంది. శరీరంలో ఐరన్‌ లోపిస్తే చిన్న పని చేసినా అలసిపోతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో ఐరన్‌ లోపాన్ని అధిగమించడానికి ఈ మూడు రకాల జ్యూస్‌లు చాలా బాగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.

బచ్చలికూర రసం: బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఇది మన శరీరానికి ఐరన్ సరఫరా చేయడంలో సహాయపడుతుంది. బచ్చలికూర రసానికి కొబ్బరి, నీళ్లు, జీడిపప్పు, పైనాపిల్ కలిపి తీసుకుంటే రుచి పెరుగుతుంది. ఈ జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది.
పీ ప్రోటీన్ షేక్ శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంలో సాయపడుతుంది. ఈ జ్యూస్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇతర ప్రోటీన్ పౌడర్లతో పోలిస్తే బఠానీ ప్రోటీన్‌లో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. బఠానీ ప్రోటీన్ పౌడర్‌తో పానీయాన్ని .. షేక్ లేదా స్మూతీగా చేసుకోవచ్చు. తీపిగా ఉండేందుకు చక్కెర కలుపకుండా చూసుకోవాలి.

బీట్‌రూట్‌ జ్యూస్‌: బీట్‌రూట్ జ్యూస్ మరొక సాధారణ ఐరన్-రిచ్ డ్రింక్. బీట్‌రూట్‌లో ఐరన్‌ అధికంగా ఉండటమే కాకుండా, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, బీటైన్, విటమిన్ సీ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో ఉండే ఖనిజాలు రక్త కణాలను సరిచేయడానికి, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో సాయపడతాయి. క్యారెట్, నారింజ లేదా ఉసిరిని కలుపుకోవడం ద్వారా బీట్‌రూట్ రసాన్ని మరింత రుచికరంగా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గుమ్మడికాయ రసం: గుమ్మడికాయ గింజలు ఐరన్‌కు గొప్ప మూలం. యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన ఖనిజాలను కూడా అందిస్తాయి. గుమ్మడికాయ గింజలతో జ్యూస్ లేదా స్మూతీని తయారు చేసుకోవచ్చు. ఆహారంలో చేర్చుకుని కూడా తినొచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..