Ayurvedic Juice: ఆరోగ్యానికి దివ్య ఔషధం ఈ ఆయుర్వేద రసం.. ఆ మూడు ఆకులతో ఆ సమస్యలు సైతం మటుమాయం..

|

Sep 05, 2022 | 11:31 AM

ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో చాలామంది పలు చికిత్సలు అనుసరిస్తుంటారు. ఆధునిక ప్రపంచంలో కూడా కొంతమంది ప్రజలు ఆయుర్వేద చికిత్సల వైపు మళ్లుతున్నారు.

Ayurvedic Juice: ఆరోగ్యానికి దివ్య ఔషధం ఈ ఆయుర్వేద రసం.. ఆ మూడు ఆకులతో ఆ సమస్యలు సైతం మటుమాయం..
Ayurvedic Juice
Follow us on

Ayurvedic Juice: ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో చాలామంది పలు చికిత్సలు అనుసరిస్తుంటారు. ఆధునిక ప్రపంచంలో కూడా కొంతమంది ప్రజలు ఆయుర్వేద చికిత్సల వైపు మళ్లుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఆయుర్వేద వైద్యంలో నయం చేయలేని వ్యాధులంటూ ఏవీ లేవు.. అన్నింటిని ఆయుర్వేదం ఎదుర్కొంటుంది. ఈ రోజుల్లో మారుతున్న వాతావరణం కారణంగా వైరల్‌ బారిన పడితే.. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కోలుకున్న తర్వాత కూడా ఆ బాధిత వ్యక్తి శరీరంలో బలహీనత కొనసాగుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే ప్రజలు తమ రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుకోవడం కోసం మంచి ఆహారం తీసుకోవడం అవసరం. ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కొన్ని రకాల రసాలను సిఫార్సు చేస్తారు. వాటిలో కొన్ని అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆ రసాలు ఏమిటంటే..?

వేప, తిప్పతీగ, తులసి రసం (neem giloy tulsi juice) మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వీటి రసం జలుబు, జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా ప్రజలు వాటిని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తారు. అయితే, వాటిని కలిపి తాగడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వ్యాధులతో పోరాడటానికి శరీర సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. అంతేకాకుండా వైరల్ వ్యాధుల ప్రభావాన్ని మరింత తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇతర వ్యాధులలో కూడా ప్రభావవంతంగా.

వేప, తిప్పతీగ, తులసి రసం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని సాధారణీకరిస్తుంది. మీరు రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గుల వల్ల కూడా ఇబ్బంది పడుతుంటే, ఈ ఆయుర్వేద రసం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మూడింటి రసం కడుపు, కాలేయానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు, కాలేయం రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ రసంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా కాలేయం దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం మరింత పెరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..