Children Health Care Tips: పిల్లల మానసిక ఎదుగుదలకు వీటిని తినిపించండి..

|

Jul 24, 2022 | 6:56 AM

Children Health Care Tips: ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లలు వేగంగా ఎదుగుతారు. పోషకాహారం మెదడును సానుకూలంగా ప్రభావితం..

Children Health Care Tips: పిల్లల మానసిక ఎదుగుదలకు వీటిని తినిపించండి..
Children Health Care
Follow us on

Children Health Care Tips: ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లలు వేగంగా ఎదుగుతారు. పోషకాహారం మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా పిల్లల అభ్యాసం, జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ప్రవర్తనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సంపూర్ణ, ఆరోగ్యకరమైన ఆహారంలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడుకు మంచి పోషకాలను అందించి.. ఒత్తిడి, ఆందోళనను తొలగిస్తాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల మానసిక ఎదుగుదలకు మంచి ఆహారాలు ఇవ్వాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్లు..
ప్రోటీన్, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుడ్లు పిల్లల ఏకాగ్రతను, శ్రద్ధను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటాయి. గుడ్డు పచ్చసొన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లలను రోజంతా సంతోషంగా ఉంచే ‘సెరోటోనిన్’ అనే హ్యాపీనెస్ హార్మోన్ ఉత్పత్తికి గుడ్లు సహకరిస్తాయి.

చేప..
చేపలలో మెదడు పనితీరుకు అవసరమైన ఒమేగా-3 కొవ్వులు, అయోడిన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. చేప మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వయస్సు కారణంగా మెదడు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. చేపలు తినేవారిలో మెదడు మరింత చురుగ్గా పని చేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఇది పిల్లల మానసిక స్థితిని నియంత్రిస్తుంది. వారి జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

జామున్(అల్లనేరడి)..
అల్లనేరడి పండు మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, కొత్త నరాల కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. పిల్లల మానసిక వికాసానికి వీటిని తీసుకోవడం చాలా ముఖ్యం.

పెరుగు..
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే తియ్యని పెరుగు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో అయోడిన్ ఉంటుంది, ఇది మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోటీన్, జింక్, బి12, సెలీనియం కూడా ఉన్నాయి. ఇవి మెదడు అభివృద్ధికి ముఖ్యమైన పోషకాలు. మీ పిల్లలకు అల్పాహారం కోసం పండ్లు, గింజలతో కూడిన సాధారణ పెరుగు ఇవ్వండి.

నారింజ..
నారింజలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. నారింజను తీసుకోవడం వల్ల పిల్లలలో మెరుగైన పనితీరు, మెరుగైన దృష్టి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, గుర్తింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మంచి నిర్ణయాధికారులు కూడా అవుతారు. ఆరెంజ్ పిల్లల నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..