Children Care: తల్లీదండ్రులకు అలర్ట్‌.. పిల్లల్లో ఊబకాయం అందుకే వస్తుందంట.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?

|

Nov 21, 2022 | 8:21 AM

ఆధునిక కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అందరూ స్థూలకాయం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Children Care: తల్లీదండ్రులకు అలర్ట్‌.. పిల్లల్లో ఊబకాయం అందుకే వస్తుందంట.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?
Child Obesity Causes
Follow us on

Child obesity causes: ఆధునిక కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అందరూ స్థూలకాయం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారంతోనే మనమే కాదు మన పిల్లలు కూడా స్థూలకాయులవుతున్నారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, మనం తీసుకునే ఆహారం, పానీయాలు ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయంటున్నారు. పిల్లలు తరచుగా జంక్ ఫుడ్ లేదా ఇతర ప్యాక్ చేసిన పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. ఇది వారి ఊబకాయానికి ఒక కారణం. ఇది కాకుండా, పిల్లలు వ్యాయామం లేదా శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. పిల్లల్లో ఊబకాయం సమస్య అనేక వ్యాధులకు కూడా దారితీస్తుందని పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడంపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించండి..

పిల్లలకు చిన్నప్పటి నుండే అన్ని పోషక విలువలు కలిగిన వాటిని తినిపించడం కాస్త కష్టమవుతుంది. మీరు మొదటి నుంచి వారి ఆహారంలో ఏది చేర్చుకుంటారో.. అలాంటి వాటినే వారు తరువాత కూడా తింటారు. పిల్లలు ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని మీరు కోరుకుంటే.. తృణధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ పండ్లు, బీన్స్, గుడ్లు, పాలు, మాంసాహారం లాంటివి తీసుకునేలా చూడండి.. ఫ్రిజ్‌లో ఉండే పదార్థాలకు దూరంగా ఉంచండి. వీటన్నింటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలకు రోజూ 2 పండ్లు, ఒక పచ్చి కూరగాయ లాంటివి తినిపించడం చాలామంచిది.

పిల్లలను హైడ్రేటెడ్ గా ఉంచండి..

పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం.. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే నీరు తాగడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. పిల్లల్లో కూడా నీరు తాగే అలవాటును పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పాఠశాలకు వెళ్లినా, ఆడుకున్నా పిల్లలకు తప్పనిసరిగా వాటర్ బాటిళ్లు ఇవ్వాలి. దీంతో పాటు నీళ్లు తాగమని కూడా చెప్పండి. దీంతో పిల్లలు నిత్యం నీళ్లు తాగేలా అలవాటు చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

పిల్లలు తగినంత నిద్రపోయేలా చూడాలి..

సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా మీ పిల్లల బరువు పెరుగుతుంది. తగినంత నిద్ర లేనప్పుడు, ఆకలిని పెంచే హార్మోన్లలో మార్పు వస్తుంది. దీని కారణంగా ఆకలి బాగా పెరగడం మొదలవుతుంది. పిల్లల శరీరం అలసిపోయినప్పుడు.. వారు చురుకుగా కనిపించరు. ఇదే అలవాటు ఉంటే.. ఎల్లప్పుడూ చురుకుగా ఉండరు. అటువంటి పరిస్థితిలో పిల్లలకు వారి వయస్సును బట్టి ప్రతి రాత్రి కనీసం 8 నుంచి 14 గంటల నిద్ర అవసరం.. కావున దీనిపై దృష్టిసారించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..