
ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తున్నాయి. సాధారణంగా గుండెపోటుకు అధిక కొలెస్ట్రాల్ ప్రధాన కారణమని చాలామంది భావిస్తారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం, కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ కొంతమందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని కేవలం కొలెస్ట్రాల్ రిపోర్ట్ ఆధారంగా అంచనా వేయడం సరైన పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగితే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ గుండెపోటు ప్రమాదానికి కొలెస్ట్రాల్ ఒక్కటే కారణం కాదు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచే ఇతర ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి.
కొంతమందిలో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ, జీవనశైలి సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు అకస్మాత్తుగా వచ్చినట్లుగా అనిపించినా, చాలా సందర్భాల్లో శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది.
మహిళలు, మధుమేహం ఉన్నవారిలో ఈ లక్షణాలు భిన్నంగా కనిపించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పనిసరి.
నోట్: ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ కథనం సాధారణ అవగాహన కోసం మాత్రమే.