
ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల రచయిత తాన్య వివాహం చేసుకున్నప్పుడు, ఆమె తల్లి ఒక ముఖ్యమైన లైంగిక సంరక్షణ చిట్కాను పంచుకుంది. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయడం మర్చిపోవద్దని.. ఇది చాలా ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుందని.. ఆమె చిట్కా సారాశం. ఇది జనాల్లో విసృతంగా అవగాహన ఉన్న అంశమే. ఇలా చేయడం ద్వారా.. మహిళలు.. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్(UTI), ఇతర ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను దూరంగా ఉండవచ్చని నమ్ముతారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలకు UTI సోకే ప్రమాదం ఎక్కువ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మొదటి సంభోగం తర్వాత, కొంతమంది స్త్రీలు UTI బారిన పడవచ్చు. ఇది అసాధారణం కాదు అని..శృంగార సమయంలో మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల సంభవించవచ్చని అంటున్నారు. మూత్రవిసర్జన సమయంలో మంట, తరచుగా మూత్రవిసర్జన లేదా పొత్తికడుపులో నొప్పి వంటివి UTI సాధారణ లక్షణాలు అని చెబుతున్నారు. అయితే సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం నిజంగా అవసరమా అని..మేము నిపుణులను అడిగాము.
నుబెల్లా సెంటర్ ఫర్ ఉమెన్స్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీతా ష్రాఫ్, సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. “శంగారం తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఇన్‌ఫెక్షన్లను కూడా నివారించవచ్చు. లైంగిక సంపర్కం సమయంలో, జననేంద్రియాల నుంచి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించవచ్చు. లైంగిక సంపర్కం తర్వాత మూత్రవిసర్జన చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తుందని, ”అని డాక్టర్ ష్రాఫ్ తెలిపారు
న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ కనికా జైన్ మాట్లాడుతూ… “లైంగిక చర్యలు… ఎస్చెరిచియా కోలి (E. కోలి) వంటి బ్యాక్టీరియాను డెవలప్ చేస్తాయి. శృంగారం అనతరం మూత్ర విసర్జన చేయడం వలన బ్యాక్టీరియా మూత్రాశయంలోకి వెళ్లే ప్రమాదాన్ని తగ్గిస్తాయి” అని చెప్పారు. సంభోగం తర్వాత 15-30 నిమిషాలలోపు మూత్ర విసర్జన చేయడం మంచిదని చెబుతున్నారు. మొదటి దశ ఇన్ఫెక్షన్ నుండి బయటపడటానికి పుష్కలంగా నీరు తాగడం ముఖ్యం. లక్షణాలు కొనసాగితే, దానిని క్లియర్ చేయడానికి యాంటీబయాటిక్స్ అవసరం కావచ్చు. చికిత్స చేయకపోతే UTI మరింత తీవ్రం అవుతుంది. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయడం 100 శాతం రక్షణను అందించదని, అయితే ఖచ్చితంగా UTI వ్యాప్తి చెందే అవకాశాలను తగ్గిస్తుందన్నది నిపుణులు వెర్షన్.
సంభోగం తర్వాత అనుసరించాల్సిన మంచి పరిశుభ్రత చిట్కాలు
శృంగారం తర్వాత కొన్ని టిప్స్ పాటిస్తే ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని నివారించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.