Brain Stroke: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? బ్రెయిస్‌ స్ట్రోకే..! మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు మార్పులు..

|

Jun 11, 2022 | 4:11 AM

Brain Stroke: మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి ఎన్నో రోగాల బారిన పడుతున్నాడు. ఇక మనిషికి ముఖ్యమైనది మెదడు. దీని గురించి తెలుసుకుందాం..

Brain Stroke: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? బ్రెయిస్‌ స్ట్రోకే..! మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు మార్పులు..
Brain Stroke
Follow us on

Brain Stroke: మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి ఎన్నో రోగాల బారిన పడుతున్నాడు. ఇక మనిషికి ముఖ్యమైనది మెదడు. దీని గురించి తెలుసుకుందాం. మెదడు పనితీరు మందగిస్తే ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్‌ వచ్చేప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ముందే పసిగడితే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలంటున్నారు. వాటిపై అవగాహన ఉంటేనే సమస్యను ముందే పసిగట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

  1. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలు..బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలను పసిగడితే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం, సాధారణమైన లక్షణమే అయినా బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముందు ఇలా జరుగుతుంది. ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం కూడా జరుగుతుంది. కంటి చూపులో తేడా వస్తుంది. కళ్లు మసకబారడం లాంటివి ఉత్పన్నమవుతాయని యూకేలో 1300 మందిపై జరిపిన సర్వేలో తేలింది. అలాగే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. చాలా మంది తలవెనుక భాగంలోనే అలా అనిపించినట్లు ఉంటుంది. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
  2. శ్వాసలో సమస్య.. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని గమనించాలంటున్నారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎంతో మేలు. ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం..10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు.
  3. మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు మార్పులు.. ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మార్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట.
  4. అధిక రక్త పోటు: ఈ స్ట్రోక్‌ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుందని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ వెల్లడిస్తోంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని వల్ల ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఎక్కువగా టెన్షన్‌కు గురి కాకుండా ఉండాలని చెబుతున్నారు.

(నోట్‌: ఇందులో అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి