Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్… ప్రతి నలుగురిలో ఒకరికి! ఆ నలుగురిలో మీరున్నారా..?

అప్పటిదాకా బాగానే ఉంటారు. మనతో నవ్వుతూ మాట్లాడతారు. ఇంతలోనే పక్షవాతం బారిన పడ్డారనే సమాచారం మనల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటే నూటికో కోటికో వచ్చే జబ్బు కాదు. ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే ప్రమాదం ఉంది. ఆ నలుగురిలో మీరున్నారా? అది తెలుసుకోవడం ఎలా? ఇంతకీ మీ బ్రెయిన్‌ భద్రమేనా?

Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్... ప్రతి నలుగురిలో ఒకరికి! ఆ నలుగురిలో మీరున్నారా..?
Brain Tumor

Updated on: Jul 21, 2025 | 5:47 PM

దేశంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారు. గత 20 ఏళ్లలో దేశంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు డబుల్‌ అయ్యాయి అంటే…మెదడుకు డేంజర్‌ బెల్స్‌ ఏ స్థాయిలో మోగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్… మన దేశంలో కోట్లాదిమందిని పీడిస్తున్న వ్యాధి. ప్రతి 20 సెకండ్లకు ఒకరికి పక్షవాతం వస్తుందని, ఏటా దాదాపు 18 లక్షల మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురౌతున్నారని మీకు తెలుసా? దీనికి సంబంధించి అనేక రకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి మీద అవగాహన లేక ఎంతోమంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఒక శాతం మంది మాత్రమే మెరుగైన వైద్యంతో బయటపడుతున్నారు. అసలు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడానికి మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు, ఒబేసిటీ, హై బీపీ, డయాబెటిస్‌, స్మోకింగ్‌ వంటివి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.  డ్రింకింగ్‌, అన్‌ హెల్తీ ఫుడ్‌ హ్యాబిట్స్‌ కూడా ఇబ్బందికరంగా మారయంటున్నారు.  బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇందులో 25శాతం మంది 40 ఏళ్ల లోపువారే అవ్వడం మరింత ప్రమాదకరం అంశం.

ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారికే వచ్చే ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా రిస్క్ ను పెంచేసింది. 20 ఏళ్లతో పోల్చితే పక్షవాతం కేసులు రెట్టింపు అయ్యాయని రిపోర్టులు తెలుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వ్యాధుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ప్రధానంగా ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడంతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీంతో మెదడులోని కణాలు చనిపోయి.. ఏదో ఒక అవయవం చచ్చుబడిపోవడం లేదా చనిపోయే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన ఒక్క నిమిషంలోనే, బ్రెయిన్‌లో 20 లక్షల న్యూరాన్స్ చనిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

మరి దీనికి నివారణ ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురైనవాళ్లకు మంచి వైద్యం అందుబాటులో ఉంది. అయితే అవగాహనా లోపమే ప్రాణాల మీదకు తెస్తోంది. ఇక బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన విషయం మనకు ఎలా తెలుస్తుంది. దాన్ని ఎలా గుర్తించాలి? ఎంతసేపటిలోపల హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలి. ఇక గోల్డెన్‌ అవర్‌ అంటే ఏంటి? ఆ విషయాలను డీటెయిల్డ్‌గా ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చినప్పుడు గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందించాలి. స్ట్రోక్‌ వచ్చినప్పటి నుంచి నాలుగున్నర గంటలను గోల్డెన్‌ అవర్‌ అంటారు.
బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలను తెలుసుకోవడానికి BE FAST సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.  B – Balance – మనిషి తూలిపోవడం. E – Eye – చూపు మసకబారడం లేదా కనిపించకపోవడం.  F- – Face – ముఖం వంకర పోవడం, మూతి పక్కకు పోవడం. A- Arm – చెయ్యి చచ్చుబడిపోవడం.
S- Speech- మాట తడబడడం లేదా మాట్లాడలేకపోవడం. T- Time- స్ట్రోక్‌ వచ్చిన తొలి నాలుగున్నర గంటలు కీలకం.

ఈ 5 లక్షణాలు ఉంటే అది పెరాలసిస్‌ అని గుర్తించాలి. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని తెలుసుకుని పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అది కూడా గోల్డెన్‌ అవర్‌లో ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలి. సో..BE FAST సూత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఇక ‘బ్రెయిన్ స్ట్రోక్ -టైమ్‌ టు యాక్ట్’ అనే స్లోగన్‌తో హైదరాబాద్‌లో స్పెషల్ క్యాంపెయిన్ జరిగింది. స్పెషలిస్టులతో వర్క్ షాప్ నిర్వహించారు. పక్షవాత లక్షణాలను ముందుగా గుర్తించి సకాలంలో చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం అని భరోసా ఇస్తున్నారు వైద్యులు. పక్షవాతం వస్తున్న ఒక శాతం మంది మాత్రమే సరైన తీసుకుంటూ మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ దేశంలోని అన్ని ముఖ్య నగరాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ తెలిపారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..