Anjeer Fruit Benefits: అంజీర పండ్లతో ఎన్ని ప్రయోజనాలో.. ముఖ్యంగా వారు ఈ పండ్లను తిన్నట్లయితే..

|

Feb 03, 2021 | 5:38 AM

Anjeer Fruit Benefits: ఏ సీజన్‌లో లభించే ఫలాలను ఆ సీజన్‌లో తినాలంటారు వైద్యులు, నిపుణులు, పెద్దలు. అలా ఫలాలను తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు..

Anjeer Fruit Benefits: అంజీర పండ్లతో ఎన్ని ప్రయోజనాలో.. ముఖ్యంగా వారు ఈ పండ్లను తిన్నట్లయితే..
Follow us on

Anjeer Fruit Benefits: ఏ సీజన్‌లో లభించే ఫలాలను ఆ సీజన్‌లో తినాలంటారు వైద్యులు, నిపుణులు, పెద్దలు. అలా ఫలాలను తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. శరీరం నిత్యం ఉత్సాహంగా ఉంటుందని చెబుతారు. అయితే ప్రస్తుతం శీతాకాల ప్రభావం మన దేశంపై బాగా ఉంది. శీతాకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది కూడా. ఈ సీజన్‌లో మనకు అత్యధికంగా అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ముఖ్యంగా అంజీర పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిందని డైటీషియన్లు, వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు మొదలు.. వృద్ధుల వరకు అందరూ ఈ పండ్లను తినవచ్చు. ఇవి తినడం ద్వార అనేక రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఎంతోమంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు అంజీర పండ్లను రోజుకు ఒకటి, రెండు పండ్ల చొప్పున తిన్నా మంచి ఫలితం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంజీర పండ్లు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎండిన అంజీర పండ్లను ఉడకబెట్టి బాగా రుబ్బుకుని దానిని గొంతు వాపు ఉన్న చోట పెట్టుకుంటే గొంతు వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. ఎండిన అంజీర పండ్లను వేడి పాలలో ఉడకబెట్టి ఉదయాన్నే తగడం ద్వారా మలబద్దకం సమస్య తీరుతుంది.

3. తాజా అంజీర పండ్లను తిన్న తరువాత ఒక గ్లాసుడు పాలు తాగడం ద్వారా శరీరం ఉత్తేజితం అవుతుంది. సంతాన లేమి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీర్యం వద్ధి చెందడం, స్త్రీలో అండోత్పత్తి సంబంధమైన సమస్యలను దూరం చేస్తుంది.

4. ఎండు అంజీర పండ్లను పాలు, చక్కెరతో కలిపి ఒక వారం పాటు తినడం వల్ల రక్త రుగ్మతలు తగ్గుతాయి.

5. అంజీర పండ్లను, ఇతర పండ్లను పోలిస్తే దాదాపు నిపుణులు అంజీర పండ్ల వల్లే ప్రయోజనాలు ఎక్కువని చెబుతారు.

6. అంజీర పండ్లు తినడం వల్ల కడుపు ఉబ్బసం కూడా తగ్గుతుంది.

7. ఉదయం సమయంలో ఎండు అంజీర పండ్లను తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న వ్యర్థాలు బయటకు పోతాయి.

8. క్షయవ్యాధిని నివారించడానికి, టిబి ప్రభావాన్ని తగ్గించడానికి తాజా అంజీర పండ్లు చాలా ఉపయోగపడుతాయి.

9. ల్యూకోరోయాతో బాధపడే వారికి అంజీర పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.

10. కడుపు నొప్పితో బాధపడేవారు, జ్వరంతో బాధపడేవారు అంజీర పండ్లను తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది.

11. అన్నికంటే ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు చక్కటి ఔషధంగా పని చేస్తాయి.

Also read:

OBC Creamy Layer: కీలక ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ పరిమితిని పెంచుతారా?.. ఓబీసీలకు మేలు జరిగేనా?..

దేశరాజధానిలో హై అలర్ట్ : ఢిల్లీలో మరిన్ని బాంబు దాడులు జరగబోతున్నట్లు చెప్పకనే చెబుతున్న తాజా పరిణామాలు