తమలపాకులు అనేక ఆరోగ్య సమస్యలకు సహజమైన వైద్యం. ఈ ఆకుల్లో టానిన్లు, ఆల్కలాయిడ్లు, ప్రోపీన్లు వంటి ముఖ్యమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, నొప్పి తగ్గిస్తాయి.
ఈ ఆకుల రసం మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఇది ఇతర కడుపు సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం.
శరీరంలో చిన్న గాయాలకు ఈ ఆకుల రసం రాసినా నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు. ఇది నొప్పి నివారణలో ఎంతో సహాయపడుతుంది.
తమలపాకుల రసంలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటంతో ఇది దంతాల బలానికి, దంతాల మధ్య సమస్యలకు, దంత క్షయం వంటి ఇబ్బందులకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.
ఈ ఆకుల రసం జలుబు, జ్వరం వంటి సమస్యలకు గొప్ప ఉపశమనంగా పని చేస్తుంది. ఇది ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌లను కూడా తగ్గించగలదు.
అలాగే గుండెనొప్పి లేదా వాంతి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.
తమలపాకులు సహజంగా శారీరక ఆనందాన్ని పెంచుతాయి. ఇది ప్రాచీన కాలం నుండి శారీరక ఆనందానికి విరుగుడుగా ఉపయోగపడుతోంది. సెక్స్ ఆసక్తి తగ్గినపుడు ఈ ఆకులు సహజంగా ఆసక్తిని పెంచడంలో సహాయపడతాయట. ఈ ఆకుల రసం అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి.