
వయసుతో సంబంధం లేకుండా కొందరికి మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. దీనికి శరీర బరువు, జీవనశైలి, ఆహారం ఇలా చాలా కారణాలు ఉండొచ్చు. అయితే కొన్ని ఆహారాలు మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చితే మోకాళ్లకు హాయిగా ఉంటుంది.
సాల్మన్, ట్యూనా, మకరెల్ అనే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి. మోకాళ్ల దగ్గర ఉండే ఇన్‌ఫ్లమేషన్ తగ్గడంతో నొప్పి తక్కువ అవుతుంది. వీటిని వారానికి రెండు సార్లు తినడం మంచిది.
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండిఉంటుంది. ఇది వాపు, నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. పసుపు వేడి పాలు తాగడం, వంటల్లో వాడటం ద్వారా మేలు లభిస్తుంది.
అల్లం తినడం వల్ల మోకాళ్ల నొప్పికి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉన్న గుణాలు వాపు తగ్గించేలా పని చేస్తాయి. అల్లం టీ లేదా అల్లం నీరు రోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది సహజమైన ఔషధంలా పని చేస్తుంది.
పాలకూర, కాలే లాంటి ఆకుకూరల్లో విటమిన్ A, C, K అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. రోజూ ఆకుకూరలు తినడం వల్ల కీళ్ల సమస్యలు తగ్గుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తినడం ద్వారా వాపు తగ్గుతుంది. దీని వల్ల మోకాళ్ల నొప్పి కూడా తగ్గుతుంది.
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించేలా పని చేస్తాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండటం వల్ల కీళ్ల సమస్యలు తగ్గుతాయి. రోజూ కొన్ని వాల్‌నట్స్ తినడం మంచిది.
ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మోకాళ్ల నొప్పిని తగ్గిస్తాయి. దీనిని వంటల్లో లేదా సలాడ్‌ల్లో చేర్చడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. సాధ్యమైనంత వరకూ రిఫైన్డ్ ఆయిల్‌ను తగ్గించి ఆలివ్ ఆయిల్ వాడాలి.
పైనాపిల్ తింటే శరీరంలోని వాపు తగ్గుతుంది. ఇందులో బ్రోమలైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది వాపుని నియంత్రించేలా పని చేస్తుంది. నిత్యం కొంత మోతాదులో పైనాపిల్ తీసుకుంటే మోకాళ్ల నొప్పి తగ్గుతుంది.
బార్లీ, క్వినోవా, ఓట్స్, రైస్ లాంటి తృణధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలోని మంటను, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. రోజు తినే ఆహారంలో ఇవి ఉండాలి. దీని వల్ల మోకాళ్ల నొప్పి కూడా తక్కువ అవుతుంది. ఈ ఆహారాలు మీ రోజువారీ జీవనశైలిలో చేర్చితే మోకాళ్ల నొప్పులు తక్కువ అవుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)