Banana Benefits: వామ్మో.. రోజు 2 అరటిపండ్లు తింటే ఇన్ని లాభాలా? శరీరంలో ఎన్నో మార్పులు

|

Aug 25, 2024 | 4:51 PM

అరటిపండును ఇష్టపడని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అరటిపండ్లు రుచిలోనూ, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. అరటిపండు తినడం వల్ల శరీరంలోని అనేక రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ప్రతి సీజన్‌లో లభించే అరటిపండు శరీరానికి మేలు చేస్తుంది. అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ ఉంటాయి. అలాగే ఇది కొవ్వు రహిత, కొలెస్ట్రాల్ లేని పండుగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా..

Banana Benefits: వామ్మో.. రోజు 2 అరటిపండ్లు తింటే ఇన్ని లాభాలా? శరీరంలో ఎన్నో మార్పులు
Banana Benefits
Follow us on

అరటిపండును ఇష్టపడని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అరటిపండ్లు రుచిలోనూ, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. అరటిపండు తినడం వల్ల శరీరంలోని అనేక రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ప్రతి సీజన్‌లో లభించే అరటిపండు శరీరానికి మేలు చేస్తుంది. అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ ఉంటాయి. అలాగే ఇది కొవ్వు రహిత, కొలెస్ట్రాల్ లేని పండుగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా అరటిని శక్తికి కేంద్రంగా పిలుస్తారు. ఈ సందర్భంలో అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.

ఎముకలకు బలం:

అరటిపండులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు రోజూ అరటిపండు, పాలు తీసుకుంటే మీ బలహీనమైన ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

కడుపు ఆరోగ్యం:

రోజుకు రెండు అరటిపండ్లు తీసుకోవడం వల్ల ప్రేగు పనితీరు, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటిపండులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అలాగే కరిగే ఫైబర్ నీటిని గ్రహించి జీర్ణవ్యవస్థ ద్వారా కదిలిస్తుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ అరటిపండు తినడం వల్ల పొట్టలో ఉండే యాసిడ్ తగ్గిపోయి శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.

రోగనిరోధక శక్తి:

ఇన్ఫెక్షన్, వ్యాధితో పోరాడటానికి రోగనిరోధక శక్తి అవసరం. అరటిపండులోని పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అరటిపండులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే అరటిపండ్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి, రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించే తెల్ల రక్త కణాల పనితీరును నియంత్రిస్తాయి. అదేవిధంగా అరటిపండులో విటమిన్ B6, జింక్ కంటెంట్ రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటాయి.

మెదడు ఆరోగ్యం:

అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అరటిపండ్లలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది సంతోషకరమైన హార్మోన్లు సెరోటోనిన్, డోపమైన్‌లను విడుదల చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మిమ్మల్ని హ్యాపీ మూడ్‌లో ఉంచుతుంది. అలాగే ఇది మంచి నిద్రను ఇస్తుంది. మెరుగైన జ్ఞానానికి దారితీస్తుంది. అరటిపండ్లలోని మెగ్నీషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. ఇది మెదడుకు సరైన ఆక్సిజన్ అందించడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడం:

అరటిపండులో ఫైబర్, విటమిన్లు ఉన్నందున ఇది సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అరటిపండులో క్యాలరీలు ఉండటం కారణంగా ఇది త్వరగా కడుపుని నింపుతుంది. ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఇది కూడా చదవండి: Liver Health: ఈ ఐదు అలవాట్లు మీ కాలేయాన్ని పాడు చేస్తాయి.. అవేంటో తెలుసా?

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి