Beauty Tips: ముఖంపై బ్లాక్ హెడ్స్ నేచురల్ టిప్స్ తో బైబై చెప్పేయండి!

| Edited By: Ram Naramaneni

Nov 05, 2023 | 9:54 PM

అందాన్ని ఇబ్బంటి పెట్టే వాటిల్లో ఈ బ్లాక్ హెడ్స్ కూడా ఒకటి. చిన్న చిన్న మచ్చల్లా ఉన్నా అవి అందానికి ఇబ్బంది ఉంటాయి. వీటి పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్స్ కి క్యూ కడతారు. అయితే అవి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులోనే కొన్ని కాస్మోటిక్స్ కొందరికి పడతాయి. మరికొందరికి పడవు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ ను పాటించడం వల్ల బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. అంతే కాకుండా డబ్బు కూడా..

Beauty Tips: ముఖంపై బ్లాక్ హెడ్స్ నేచురల్ టిప్స్ తో బైబై చెప్పేయండి!
Blackheads Removal Tips
Follow us on

అందాన్ని ఇబ్బంటి పెట్టే వాటిల్లో ఈ బ్లాక్ హెడ్స్ కూడా ఒకటి. చిన్న చిన్న మచ్చల్లా ఉన్నా అవి అందానికి ఇబ్బంది ఉంటాయి. వీటి పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్స్ కి క్యూ కడతారు. అయితే అవి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులోనే కొన్ని కాస్మోటిక్స్ కొందరికి పడతాయి. మరికొందరికి పడవు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ ను పాటించడం వల్ల బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. అంతే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది.

సాధారణంగా ఈ బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయంటే.. చెమట పట్టినప్పుడు స్కిన్ రంద్రాల లోపటి నుంచి కొన్ని శరీర ద్రవాలు బయటకు వస్తాయి. వీటిల్లో ఆయిల్, లవణాలు వంటివి ఉంటాయి. ఇవి కాస్తా దుమ్మూ, ధూళి చేరి బ్లాక్ హెడ్స్ గా మారిపోతాయి. ఇంట్లోనే కొన్ని రకాల స్క్రబ్స్ ఉపయోగించి వీటిని తొలగించుకోవచ్చు.

నిమ్మకాయ – ఉప్పు:

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ – ఉప్పు రెండూ బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసుకున్నట్లుగా సున్నితంగా మర్దనా చేస్తూ కడిగేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అయితే నిమ్మ కాయ కొందరికి పడదు. అలాంటి వారు దీనికి దూరంగా ఉండాలి.

కమలా పండు తొక్కలతో:

కమలా పండు తొక్కలను ఎండ బెట్టి.. పౌడర్ లా చేసుకోవాలి. ఈ పౌడర్ లో కొద్దిగా ఓట్ మీల్ పొడి, పెరుగులను వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసుకుని ఓ 15 నిమిషాలు ఆర నివ్వాలి. ఇప్పుడు ఓ రెండు, మూడు నిమిషాల పాటు కొద్దిగా వాటర్ తీసుకుని మెల్లగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తే.. బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖం కూడా గ్లోయింగ్ గా తయారవుతుంది.

కొబ్బరి నూనె – పంచదార:

ఒక చిన్న బౌల్ లోకి కొద్దిగా కొబ్బరి నూనె, పంచదారనే వేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి ఓ 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత సున్నితంగా మర్దనా చేయాలి. నెక్ట్స్ ఫేస్ ని వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. ఈ స్క్రబ్ వల్ల ఫేస్ సాఫ్ట్ గా, గ్లోగా తయారవుతుంది.

గమనిక: ఇవి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించండి.