వేసవి వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? ఈ జ్యూస్ తాగితే అంతా సెట్ అయిపోతుంది..!

వేసవి వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచే ప్రకృతి సిద్ధమైన డ్రింక్స్ లలో బత్తాయి జ్యూస్ ప్రత్యేకమైనది. ఇందులో ఉండే విటమిన్‌ లు, ఖనిజాలు శరీరానికి శక్తిని అందించడమే కాదు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ కొద్దిపాటి బత్తాయి రసం తాగడం వల్ల శక్తి, చర్మ ఆరోగ్యం, హైడ్రేషన్ మెరుగవుతుంది.

వేసవి వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? ఈ జ్యూస్ తాగితే అంతా సెట్ అయిపోతుంది..!
Mosambi Health Benefits

Updated on: May 14, 2025 | 11:09 AM

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలతో శరీరం నీరసం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచే ప్రకృతిసిద్ధమైన డ్రింక్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో బత్తాయి జ్యూస్ అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫైబర్ తోపాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన మూలకాలు. ప్రతి రోజు బత్తాయి రసం తాగడం వల్ల ఈ పోషకాలు నిత్యం అందుతాయి.

వేడి వల్ల శరీరం బలహీనంగా మారినప్పుడు గ్లాసంత బత్తాయి రసం తాగితే తక్షణం శక్తిని తిరిగి పొందే అవకాశం ఉంది. ఇది శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది. వేడి వల్ల ఏర్పడే నీరసం, తలనొప్పి వంటి లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఈ జ్యూస్ తాగడం వల్ల లోపలుండే వేడి తగ్గిపోతుంది. వేసవిలో అధికంగా కనిపించే హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే సహజ మార్గాల్లో ఇది ఒకటి.

విటమిన్ సి శరీరంలో రోగాలకు ప్రతిఘటించే శక్తిని పెంపొందిస్తుంది. ఈ పండు ద్వారా తీసుకునే జ్యూస్ ఈ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ కొద్దిపాటి బత్తాయి రసం తాగటం వల్ల మానసిక శక్తి కూడా ఉత్సాహంగా ఉంటుంది.

ఈ డ్రింక్ తాగడం వల్ల చర్మంపై సహజమైన కాంతి కనిపిస్తుంది. వేసవిలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటే.. బత్తాయి జ్యూస్ తాగడం ద్వారా చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.

బత్తాయి రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. వేసవిలో తక్కువ ఆహారం తీసుకునే సమయంలో జీర్ణక్రియ సహజంగా జరిగేందుకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడం, శక్తిని నిలుపుకోవడం, చర్మ ఆరోగ్యం పరిరక్షించుకోవడం కోసం బత్తాయి జ్యూస్ నిత్యం తీసుకోవడం చాలా ఉపయోగకరం. సహజంగా లభించే ఈ రసం తాగడం వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)