Snoring: రాత్రుళ్లు గురక పెడుతున్నారా.? పడుకునే ముందు వీటిని తినడం ఆపేయండి..

|

Sep 25, 2023 | 7:47 PM

గురక సమస్య నుంచి బయటపడడానికి వైద్యులను సంప్రదిస్తుంటారు. వీటికి మార్కెట్లో కొన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా కూడా గురక తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తీసుకునే ఆహారం కూడా గురకకు కారణంగా మారుతుందని మీకు తెలుసా.? అవును రాత్రుళ్లు కొన్ని రకలా ఫుడ్స్‌ కారణంగా గురక వేధించే...

Snoring: రాత్రుళ్లు గురక పెడుతున్నారా.? పడుకునే ముందు వీటిని తినడం ఆపేయండి..
Snoring
Follow us on

గురక.. వినడానికి చిన్న సమస్యే అయినా. పక్కన పడుకున్న వారికి మాత్రం ఇదొక నరకం. అయితే కేవలం పక్కన పడుకున్న వారికి మాత్రమే కాకుండా గురక పెట్టే వారి ఆరోగ్యంపై కూడా గురక తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాసలో అంతరాయం ఏర్పడకపోవడం వల్ల ఆక్సిజన్‌ సరిగ్గా అందదు.. దీంతో రకరకాల ప్రాణాంతక అనారోగ్యాలకు గురక కారణంగా మారుతుంది. ఇక గురక నుంచి బయటపడడానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి.

గురక సమస్య నుంచి బయటపడడానికి వైద్యులను సంప్రదిస్తుంటారు. వీటికి మార్కెట్లో కొన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా కూడా గురక తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తీసుకునే ఆహారం కూడా గురకకు కారణంగా మారుతుందని మీకు తెలుసా.? అవును రాత్రుళ్లు కొన్ని రకలా ఫుడ్స్‌ కారణంగా గురక వేధించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ఫుడ్‌.? ఆ ఫుడ్‌ గురకకు ఎందుకు కారణంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రి పడుకునే ముందు గోధుమలు, గోధుమ పిండితో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల శ్వాస నాళాల్లో ఇన్ఫ్లమేషన్‌ రావొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా గోధుమల్లో ఉండే గ్లుటెన్‌ శ్లేష్మం పెరగడానికి కారణంగా మారొచ్చని చెబుతున్నారు.

* ఇటీల ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే దీనివల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు. అధికంగా ప్రాసెస్‌ చేసిన ఫాస్ట్ ఫాడ్‌ను తీసుకోవడం వల్ల గురక సమస్య వచ్చే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఫాస్ట్‌ పుడ్‌తో అజీర్తి సమస్య కూడా రావొచ్చు,ఇది నిద్ర బంగానికి, గురకకు కారణం అవ్వొచ్చు.

* ఇక రాత్రుళ్లు గురక రాకుండా ఉండాలంటే కొన్ని రకాల డైరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా పెరుగు, జున్ను, ఐస్‌క్రీమ్‌ వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. డైరీ ఉత్పత్తుల్లో ఉండే లాక్టోజ్‌ గురకను ఎక్కువ చేసే శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది.

* ప్రాసెస్‌ చేసిన చక్కెరలకు దూరంగా ఉండాలి. వీటివల్ల గొంతు, ముక్కు భాగాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. అందుకే సాయంత్రం పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీట్స్‌, కూల్‌ డ్రింక్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

* కొవ్వు, ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తీసుకున్నా గురక వచ్చే అవకాశాలు ఉంటాయి. కొవ్వులు కఫ ఉత్పత్తి పెరగడానికి కారణంగా మారొచ్చు. కాబట్టి రాత్రి సమయంలో త్వరగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండడమే ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే మంచిదని గుర్తించాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..