Peanut Side Effects: వేరుశెనగ తింటే మంచిదే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు..

వేరుశెనగ గింజలు(పల్లీలు) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, విటమిన్ ఇ, జింక్(Zink), పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి...

Peanut Side Effects: వేరుశెనగ తింటే మంచిదే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు..
Peanuts

Updated on: Apr 19, 2022 | 6:41 PM

వేరుశెనగ గింజలు(పల్లీలు) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, విటమిన్ ఇ, జింక్(Zink), పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి ప్రతి ఇంట్లో దర్శనమిస్తాయి. అయితే ఈ వేరుశెనగల(Peanut)ను మాత్రం మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పల్లికాయ.. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు మాత్రం ఎట్టిపరిస్థితిలో తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తింటే సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వివరిస్తున్నారు. వేరుశెనగ ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో చూద్దాం..

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వేరు శెనగలను అస్సలు తినొద్దు. పొరపాటున గానీ వీటిని తీసుకున్నారో TSH లెవెల్ పెరుగుతుంది. అందుకే వీటిని వీళ్లు తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే థైరాయిడ్ టాబ్లెట్లను వాడేవాళ్లు మాత్రం వీటిని పూర్తిగా తీసుకోకపోవడమే మంచిది. అలెర్జీ సమస్య ఉన్నట్టైతే మీరు వేరుశెనగలను తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వీటిని తింటే చర్మంపై దద్దుర్లు, కాళ్లలో దురద, పెదవులపై వాపు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవిలో వీటిని మోతాదులోనే తీసుకోవాలి.

కాలేయ సమస్యతో బాధపడేవారు వేరుశెనగలను తినొచ్చు. కానీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. పల్లిలలో ఉండే కొన్ని మూలకాలు కాలేయంపై చెడు ప్రభావం చూపుతాయి. కాలేయ సమస్య ఉన్న వాళ్లు వేరువెనగలను తీసుకోకపోవడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులున్న వారు పల్లిలు మొత్తమే తినడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఎందుకంటే వేరుశెనగల్లో ఉండే లెక్టిన్ అనే పదార్థం నొప్పులను మరింత పెంచుతాయి. అధిక బరువుతో బాధపడేవారు తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు, బరువు తగ్గాలనుకున్న వాళ్లు వేరుశెనగలను మోతాదులోనే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఎన్నో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీరు మరింత బరువు పెరగడానికి ఉపయోగపడతాయి.

Read Also.. Benefits of Papaya: నిగనిగలాడే బొప్పాయితో ఇన్ని ఉపయోగాలా..! ఎలాంటి ప్రయోజనాలంటే..!