Health News: మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువ.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!

|

Apr 17, 2022 | 1:48 PM

Health News: రక్తహీనత అనే వ్యాధి రక్తంలో RBC అంటే ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు సంభవిస్తుంది. దీని వల్ల శరీరంలో శక్తి లేకపోవడం, అలసట,

Health News: మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువ.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!
Anemia
Follow us on

Health News: రక్తహీనత అనేది రక్తంలో RBC అంటే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు సంభవిస్తుంది. దీని వల్ల శరీరంలో శక్తి లేకపోవడం, అలసట, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం, నిద్ర పట్టకపోవటం, ఊపిరి ఆడకపోవడం మొదలైన సమస్యలు ఉంటాయి. రక్తహీనత సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కారణంగా వారి ఆరోగ్యం తరచుగా క్షీణిస్తుంది. రక్తహీనత రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మహిళల్లో రక్తహీనతకు ఋతుస్రావం ప్రధాన కారణమని చెబుతారు. సరైన పోషకాహారం లేకపోవడం, పీరియడ్స్ సమయంలో రక్తం కోల్పోవడం వల్ల రక్తహీనత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పురుషులలో కూడా రక్తహీనత ఏర్పడుతుంది. కానీ చాలా తక్కువమంది మాత్రమే దీని బారిన పడుతారు. పురుషుల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 13.5 కంటే తక్కువగా ఉంటే దానిని రక్తహీనతగా గుర్తిస్తారు. మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయి 12 కంటే తక్కువగా ఉంటే రక్తహీనత వ్యాధిగా గుర్తిస్తారు.

రక్తహీనతకి కారణాలు

1. ప్రసవ కారణంగా మహిళలు రక్తహీనతకి గురి కావొచ్చు

2. ఐరన్ లోపం వల్ల కూడా రక్తహీనత రావచ్చు.

3. అల్సర్, పైల్స్, జీర్ణ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల కూడా రక్తహీనత రావచ్చు.

4. ఫోలిక్ యాసిడ్, విటమిన్ల లోపం గర్భిణీ స్త్రీలలో రక్తహీనతకు దారితీస్తుంది.

5. వృద్ధాప్యంలో 65 ఏళ్ల తర్వాత, శరీరంలో రక్తహీనత సంభవించవచ్చు.

రక్తహీనత కోసం నివారణలు

రోజుకు కనీసం రెండు గ్లాసుల పాలు తాగాలి. ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, మఖానా ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో విటమిన్-సి, ఫోలిక్ యాసిడ్ చేర్చాలి. ఎండుద్రాక్ష, బత్తాయి, బీట్‌రూట్, బచ్చలికూర మొదలైనవి తినండి. అరటి, యాపిల్, చికూ, పైనాపిల్ వంటి పండ్లను తీసుకుంటే మంచిది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Vaishakh Month 2022: నేటి నుంచి వైశాఖ మాసం ప్రారంభం.. ఈ మాసం ప్రాముఖ్యత, నియమాలు తెలుసుకోండి..

Dinesh Karthik: దినేశ్‌ కార్తీక్ మళ్లీ చెలరేగాడు.. ఆ బంగ్లాదేశ్ బౌలర్ వేసిన ఒకే ఓవర్లో 28 పరుగులు..!

IPL 2022: విరాట్‌ కోహ్లీని తిట్టినవారు ఇప్పుడు రోహిత్‌ శర్మ విషయంలో ఏం చెబుతారు..!