
కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని అంటారు.. ఎందుకంటే ఈ చెట్టులోని వస్తువులన్నీ ఉపయోగపడతాయి. కొబ్బరి, కొబ్బరి నీరు, కొబ్బరి నూనే.. ఇలా అన్ని ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.. కొబ్బరి నుంచి తీసిన నూనె తీపితోపాటు.. అత్యంత పోషకమైనది. ఎక్కువగా ఈ నూనెను జుట్టుకు అప్లై చేయడానికి ఉపయోగిస్తారు. అయితే.. కొబ్బరి నూనెలో పోషకాల సంపద దాగుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. కొబ్బరి నూనెలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ కూడా ఉంటుంది. అందుకే.. ఆయుర్వేదంలో కొబ్బరి నూనె ప్రయోజనకరమైనదిగా వివరించారు.
అయితే, కొబ్బరి నూనెను జుట్టుకు అప్లై చేయడంతోపాటు.. టానిక్‌గా తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వివరిస్తున్నారు. చలికాలంలో ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల శరీరానికి ఐదు శక్తివంతమైన ప్రయోజనాలు లభిస్తాయి.
కొబ్బరి నూనె శరీరంలో శక్తిని పెంచుతుంది. చలికాలంలో శరీరం చాలా వరకు నీరసంగా ఉంటుంది. ఒక చెంచా కొబ్బరి నూనె తాగడం వల్ల రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఉదయాన్నే కొబ్బరినూనె తాగడం వల్ల రోజంతా శరీరం బలహీనపడదు… శక్తి లభిస్తుందని పేర్కొంటున్నారు.
ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తాగడం వల్ల శరీరంలోని కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొబ్బరి నూనె తాగడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. కొబ్బరి నూనె మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.. ఇంకా మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొబ్బరి నూనె థైరాయిడ్ హార్మోన్ పనితీరుకు మద్దతు ఇస్తుంది. దీని వినియోగం జీవక్రియను మెరుగుపరుస్తుంది.. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
కొబ్బరి నూనెలో బరువు తగ్గడానికి సహాయపడే పదార్థాలు ఉన్నాయి. కొబ్బరి నూనెలో యాంటీవైరల్ గుణాలతోపాటు.. మరిన్ని పోషకాలు ఉన్నాయి. దీని కారణంగా, శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. కొబ్బరి నూనె ఆకలిని తగ్గించడానికి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది..
కొబ్బరినూనె తాగడం వల్ల చర్మం లోపల తేమగా ఉండి అందాన్ని పెంచుతుంది. ఇది ముఖంపై మచ్చలను తొలగిస్తుంది. కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల జుట్టు బలంగా – మెరుస్తూ ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి