Tulsi Leaves: షుగర్ సహా ఆ వ్యాధులకు దివ్యౌషధం తులసి.. రోజుకు ఎన్ని ఆకులు తినాలో తెలుసా?

|

Jul 21, 2024 | 11:53 AM

Tulsi Leaves For Diabetes:ప్రస్తుతకాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది మధుమేహాన్ని సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి తులసి దివ్య ఔషధం.. వాస్తవానికి తులసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Tulsi Leaves: షుగర్ సహా ఆ వ్యాధులకు దివ్యౌషధం తులసి.. రోజుకు ఎన్ని ఆకులు తినాలో తెలుసా?
Tulsi Leaves
Follow us on

Tulsi Leaves For Diabetes:ప్రస్తుతకాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది మధుమేహాన్ని సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి తులసి దివ్య ఔషధం.. వాస్తవానికి తులసి మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి.. రోజూ 5-7 తులసి ఆకులను క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

తులసి ఆకులు కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. వీటిలోని ఔషధ గుణాలు.. పలు సమస్యలను వ్యాధులను నియంత్రించడంలో సహాయపడతాయి.. అందుకే వీటిని దివ్యౌషధంగా పరిగణిస్తారు..

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది..

తులసి ఆకులను తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను కూడా నియంత్రించగలదు. తులసిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తులసి ఆకుల సారం బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రక్తపోటు నియంత్రణ: తులసిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ని తగ్గించే సమ్మేళనాలు ఉన్నాయి. అలాగే ఈ ఆకులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తులసిలోని యూజినాల్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బులు తగ్గుతాయి..

మానసిక ఆరోగ్యం: ఆయుర్వేద వైద్యంలో తులసి మూలిక లాంటిది.. ఈ ఆకులు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి.

చర్మ సమస్యలు: తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్, శ్వాసకోశ సమస్యలు, కడుపు, మూత్ర సంబంధిత రుగ్మతలు, కడుపు పూతల, చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థ – బరువు నియంత్రణ: తులసి ఆకులను తీసుకోవడం వల్ల కడుపుకు కూడా మంచిది. దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ తులసి సగటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

కావున.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 3 నుండి 8 తులసి ఆకులను తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..